నారా వారి నీతి కథలు


– బలం లేకున్నా బరిలోకి మూడో అభ్యర్థి 
– ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో బేరసారాలు షురూ..
– ఓటుకు నోటు కేసులో శిక్ష పడలేదన్న ధైర్యం
– తెలంగాణలో ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన బాబు
– బలం లేకపోయినా అభ్యర్థిని నిలపడంపై టీఆర్‌ఎస్‌పై నాడు చంద్రబాబు ఫైర్‌ 
– నాడు తప్పనిచెప్పిందే ఇప్పుడు చేస్తున్న ఏపీ సీఎం 

చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది అవేవో అన్నట్టు.. చంద్రబాబు వ్యవహారం ఎప్పటికీ వివాదాస్పందంగా, సందేహాస్పదంగానూ ఉంటుంది. పక్కనోడికి కష్టం వచ్చినప్పుడు అధైర్యపడొద్దు.. కష్టాల నుంచి అనుభవాలు నేర్చుకోవాలని సుద్దులు చెప్పే చంద్రబాబు.. తనకు కష్టం వచ్చినప్పుడు మాత్రం దేశమే కష్టాల్లో ఉన్నట్టు మాట్లాడతాడు. తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరితే చంద్రబాబు గగ్గోలు పెట్టాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కే సీఆర్‌ మీద ఒంటి కాలితో లేచాడు. ప్రజాస్వామ్యానికి చీకటి దినం, రాజ్యాంగాన్ని కాలరాశారు.. న్యాయదేవత తలదించుకోవాలి వంటి పడికట్టు పదాలతో అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని కన్నీరుమున్నీరయ్యాడు. పార్టీ మారిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు మంత్రి పదవి ఎలా ఇస్తారంటూ..ఆయన రాజీనామా చేసి వెంటనే టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని గగ్లో పెట్టాడు. ఇది జరిగిన నెలలు గడవక ముందే చంద్రబాబు.. అధికారాన్ని అడ్డం పెట్టకుని వైయస్‌ఆర్‌సీపీపై ప్రతాపం చూపెట్టాడు. బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నాడు. ఆనాడు తెలంగాణలో జరిగింది తనకు తప్పనిపించింది.. ఆంధ్రాలో మాత్రం న్యాయంగా కనపడింది. అయితే తాను చేస్తున్న అభివృద్ధిని చూసే ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయిస్తున్నారని బొంకిన చంద్రబాబుకు షాక్‌ తగిలేలా.. ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యే చంద్రబాబు వ్యవహారంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. వైయస్‌ఆర్‌సీపీ నుంచి గెలిచిన కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ.. తాను డబ్బుల కోసమే టీడీపీకి అమ్ముడుపోయానని చెప్పాడు. కానీ తనకిచ్చిన హామీలు నెరవేరలేదని చెప్పి చంద్రబాబుకు గాలి తీసేశాడు. 

ఆ తర్వాత చంద్రబాబు కూడా కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అడ్డదారి తొక్కి అడ్డంగా దొరికిపోయాడు. తనకు బలం లేకపోయినా టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిందని రంకెలేసి.. ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు పంపించి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఓటుకు నోటు కేసులో నేషనల్‌ మీడియా చంద్రబాబును ప్రశ్నిస్తే ఎప్పుడూ సూటిగా సమాధానం చెప్పనేలేదు. వాయిస్‌ మీదా కాదా అంటే.. ఎమ్మెల్యేను కొనాలని చూశారా లేదా అంటే.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిలబెట్టిందని అడ్డగోలువాదన చేశాడు. 
ఇప్పుడు ఆంధ్రాలోనూ అదే.. 
మొన్న తెలంగాణలో ఏదైతే జరిగిందే.. ఇప్పుడు ఆంధ్రాలోనూ అదే జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల కొనుగోలు వేట మొదలైంది. ఇప్పటికే విడతలవారీగా 23 మందిని కొనుగోలు చేసిన టీడీపీ.. ఇప్పుడు మళ్లీ నీతిబాహ్యమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆనాడు బలం లేకపోయినా అభ్యర్థిని బరిలో దింపాడని కేసీఆర్‌ను ఎలాగైతే చంద్రబాబు ఆడిపోసుకున్నాడో.. ఇప్పుడూ ఆంధ్రాలో చంద్రబాబు తనకు బలం లేకపోయినా మూడో అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రారంభించింది. ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి రేట్లు మాట్లాడుతోంది. మైకు దొరికినప్పుడు నీతినీజాజాయతీలు, ముదురు బెండకాయలు.. రాజ్యాంగం అని శుద్దపూజలా మాట్లాడే చంద్రబాబు.. మొన్నటి ఓటుకు నోటు కేసు నుంచి విజయవంతంగా విచారణకు దూరంగా ఉన్నాడన్న దీమాతో మరో అడ్డగోలు దిగజారుడు రాజకీయానికి తెరలేపాడు. 

Back to Top