పచ్చపార్టీ సంత భేరంపై ప్రజా ఉద్యమం

సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోళ్లు
చంద్రబాబు నీచ రాజకీయాలపై ప్రజాగ్రహం

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అవినీతి, అక్రమాలే పరమావధిగా పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అవినీతి సొమ్మును వెదజల్లుతూ నిస్సిగ్గుగా,  ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల్లా కొనుగోలు చేస్తున్న చంద్రబాబుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణ‌లో ఎమ్మెల్యేలను  కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయ‌ల‌ు ఇవ్వజూపుతూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...ఇప్పుడు అదే దుర్బిద్ధిని ఏపీలో కొనసాగిస్తున్న విధానంపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. 

రాజ్యాంగ విలువ‌లకు తిలోదకాలిస్తూ , ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిహాసం చేస్తూ పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తున్న బాబు చ‌ర్య‌ల‌కు నిర‌స‌న‌గా ..వైఎస్సార్‌సీపీ ఈ నెల 23న సేవ్ డెమొక్ర‌సీ ఆందోళ‌న చేపట్టనుంది.   దీనికి వామ‌ప‌క్షాల‌ు స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. రాష్ట్రంలో టీడీపీ ప్ర‌భుత్వానికి అవ‌స‌ర‌మైన సంఖ్యాబ‌లం ఉన్న‌ప్ప‌టికీ అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌టంపై ఆయా పార్టీల నేత‌లు విరుచుకు ప‌డుతున్నారు. ఇది ఎమ్మెల్యేల‌ను ఎన్నుకున్న ఓటర్ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని, ఇలాగే వ్య‌వ‌హారిస్తే ప్ర‌జా విప్ల‌వాలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రిస్తున్నారు. 

అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్ల వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌తో అవ‌స‌రం లేద‌నే విధంగా బ‌రితెగించి వ్య‌వ‌హారిస్తే ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్ష‌మ‌వుతార‌ని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్య‌వ‌హరిస్తున్న చంద్రబాబు తీరుపై రాష్ట్రావ్యాప్తంగా విస్తృత‌మైన చర్చ జ‌రుగుతోంది. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కోసం వైఎస్సార్‌సీపీ చేప‌ట్టిన సేవ్ డెమొక్ర‌సీ ఉద్య‌మంలో తామూ భాగ‌స్వాముల‌వుతామ‌ని ప్ర‌జ‌లు భారీగా ముందుకు వ‌స్తున్నారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో  వైఎస్సార్సీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతారు. అదేవిధంగా పెద్ద ఎత్తున బహిరంగసభలు నిర్వహించి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతారు. 

Back to Top