మాట త‌ప్ప‌డు..మ‌డ‌మ తిప్ప‌డు

రాజశేఖరుడి రాజసం.. 
మహానేతలా మడమ తిప్పని నైజం.. 
మాట తప్పని వ్యక్తిత్వం.. 
కష్టాలకు వెన్ను చూపని ధైర్యం.. 
పోరాటాలకు వెరవని ధీరత్వం. 
అలుపెరగని శ్రామికుడు.. 
జనం మెచ్చిన నాయకుడు
ఎగిసి పడిన కెరటం కాదు.. 
పడినా లేచొచ్చే తరంగం
అలసి పోయే వేకువ కాదు... 
విరామమెరుగని ప్రవాహం 
అదిమి పట్టాలంటే అలవికాడు..
దూసుకొచ్చే ఉప్పెన 
అతడే ఒక సైన్యం.. 
జనమే అతడి స్థైర్యం
ఇవన్నీ ఒకే వ్యక్తి గురించి చెప్పాలంటే.. ఆయనకు పేరు పెట్టాలంటే.. ఈ వ్యక్తిత్వానికి.. ధైర్యసాహసాలకు రూపం ఇవ్వాలంటే అది జననేత వైయస్‌ జగన్‌కు తప్ప మరెవ్వరికీ సరిపోవు. డిసెంబ‌ర్ 21న వైయ‌స్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం. 

మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు వైయస్‌ జగన్‌ను జనాలకు మరింత చేరువ చేశాయి.  ప్రతిపక్షం సహా స్వపక్షం నుంచి ఎదురవుతున్న ఒక్కో సవాల్‌కు  ధైర్యంగా సమాధానమిచ్చి జనం వద్దన్న పార్టీ నాకూ వద్దని కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చారు. తాను, అమ్మ.. ఇద్దరితో మొదలైన వైయస్‌ఆర్‌సీపీ ప్రస్థానం నుంచి ప్రతిపక్ష నాయకుడిగా జనం జేజేలు అందుకునే స్థానాన్ని సంపాదించారు. బాబాయిని దూరం చేసి కుటుంబాన్ని చీలుద్దామనుకున్న కాంగ్రెస్‌ కుట్రలకు త్వరలోనే కాలం చెల్లింది. వైయస్‌ఆర్‌ లాంటి పెద్ద దిక్కును కోల్పోయిన పార్టీ భూస్థాపితమైంది. వైయస్‌ జగన్‌ నాయకత్వంలో దూసుకొచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ఒక్కో మెట్టూ ఎక్కుతూ జనం గుండెల్లో చోటు సంపాదించింది. పెద్దాయన నుంచి పుణికి పుచ్చుకున్న మాట తప్పని నైజం.. మడమ తిప్పని వ్యక్తిత్వం ఆయన్ను జననేతను చేసింది. 

నల్లకాలువ సభలో ఇచ్చిన మాట కోసం 
వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత నల్లకాలువ సభలో ఆ మహానేత వారసుడిగా ఇచ్చిన మాట కోసం ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ‘ఓదార్పు’ యాత్ర వద్దన్న పార్టీ నాకూ వద్దని బయటకొచ్చిన మరుక్షణం నుంచి కష్టాలు మొదలయ్యాయి. వైయస్‌ఆర్‌ ఉన్నంత కాలం కాంపౌండ్‌ వైపు చూడటానికి కూడా భయపడిన కష్టాలు ఆ కుటుంబాన్ని కబలించాలని చూశాయి. అధికారం అండ చూసి జననేతను జైల్లో పెట్టి విర్రవీగాయి. రాముడు అడవుల కెళ్లడం, పాండవుల అరణ్యవాసం గురించి విన్నాం.  పురాణాల్లో చదివాం. పార్టీ నిర్ణయాన్ని కాదని బయటకొచ్చినందుకు ఆ రాముడి కన్నా ఎక్కువ కష్టాలు పడ్డాడు వైయస్‌ జగన్‌. అధికార, ప్రతిపక్షాలన్నీ ఒక్కటై  ఆ కుటుంబాన్ని కన్నీళ్లు పెట్టించి నవ్వుకున్నాయి. కష్టాల సుడిగుండంలోకి నెట్టి వైయస్‌ జగన్‌ను దారికి తెచ్చుకోవాలని పగటి కలలు కన్నాయి. అయితే ఉప ఎన్నికల్లో 16 సీట్లలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించి అధికారం చెంప చెల్లుమనిపించారు జనం. ఇన్నాళ్లు మా కుటుంబాలకు అండగా నిలిచిన మహానేత కుటుంబానికి మద్ధతుగా నిలుస్తామని ఎన్నికల ఫలితాలతో మంచి సందేశం ఇచ్చారు. వైయస్‌ జగన్‌ జైల్లోనే ఉన్నా  జగనన్న వదిలిన బాణంలా ప్రచార భారాన్ని భుజాలెత్తుకున్న వైయస్‌ షర్మిలకు జనం బ్రహ్మరథం పట్టారు. ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లడాన్ని కూడా ఆనందంగా భరించిన వైయస్‌ జగన్‌ రాక కోసం జనం వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఆయన  విడుదలైన క్షణాలను చూద్దామని వచ్చిన జనాలతో దారులన్నీ ఏరులయ్యాయి. 
ఎన్నికల్లో ఓడినా వెనకడుగే లేదు
2014 ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైయస్‌ఆర్‌సీపీ ఓడినా 
వైయస్‌ జగన్‌ ఏరోజూ దిగులు పడలేదు. పార్టీ పెట్టిన తర్వాత ఎదుర్కొన్న మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ సాంకేతికంగా ఓడినప్పటికీ నైతికంగా జనం మద్ధతును కూడగట్టడంలో మాత్రం విజయం సాధించింది. కేవలం రెండు శాతం(5 లక్షల ) స్వల్ప మెజారిటీతో టీడీపీ విజయం సాధించినా అది మోసపూరిత విజయమని అందరికీ తెలిసొచ్చింది. కాదు.. వైయస్‌ జగన్‌ పోరాటం నిరూపించింది. ఇంతటితో జగన్‌ పని అయిపోయిందన్న విమర్శకుల మాటలకు అసెంబ్లీ సమావేశాల్లో  అధికార పార్టీని ప్రజా సమస్యలపై నిలదీసి ముప్పుతిప్పలు పెట్టారు.   చంద్రబాబు ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న.. బేషరతుగా రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇంటింటికీ ఉద్యోగం.. నిరుద్యోగ భృతి, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇంటి నిర్మాణానికి స్థలం లాంటి హామీలపై సర్కారును నిలదీశాడు. హామీలు అమలు చేయకుండా పారిపోతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గళ్లా పట్టుకొచ్చి జనం ముందు దోషిలా నిలబెట్డాడు. 
జగన్‌ ధర్నాలతోనే అమలవుతున్న పథకాలు 
చివరికి ఏపీలో పరిస్థితి జగన్‌ పస్తులుంటే తప్ప ప్రభుత్వం హామీలు నెరవేర్చని పరిస్థితి. తొలి విడత రైతు రుణమాఫీ.. రెండో విడత రుణమాఫీ తీసుకుంటే వైయస్‌ జగన్‌ నిరాహార దీక్ష చేయకుండా రైతులకు చేరలేదు. రైతు భరోసా యాత్రల పేరుతో జనం మధ్యకు వెళితే తప్ప ప్రభుత్వానికి కరువు గుర్తుకురాదు. ఫీజు పోరు చేస్తే తప్ప ఫీయి రీయింబర్స్‌మెంట్‌ గుర్తుకు రాదు. ఆరోగ్య శ్రీ నిధులు రావాలంటే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేయాలి. ప్రత్యేక హోదా రాష్ట్రానికి అవసరం అని గుర్తుకు రావాలంటే యువభేరిలు నిర్వహించాల్సిందే. నోట్ల రద్దుపై జనం సమస్యలు ప్రభుత్వానికి తెలియాలంటే ప్రధానికి లేఖ రాయాల్సిందే. ఇలా రాష్ట్రంలో అమలు జరగాల్సిన.. జరుగుతున్న ప్రతి పథకం వెనుక జగన్‌ కష్టం తప్పకుండా కనిపిస్తుంది. నిత్యం చంద్రాబాబు వెనుకుండి బెత్తంతో అదిలిస్తే తప్ప ప్రజల కష్టాలు తెలియవు. అమరావతి రాజధాని పేరుతో భూముల దోపిడీ, ఇసుక అక్రమ రవాణా, విజయవాడ దుర్గమ్మ భూముల కైంకర్యం, విశాఖలో దసపల్లా హిల్స్, పశ్చిమ గోదావరిలో గోదావరి మెగా ఆక్వాఫుడ్స్‌ బాధితులకు భరోసా, తూర్పు గోదావరిలో బందరు పోర్టు బాధితులకు అండగా ఉద్యమం, పోలవరం నిర్వాసితులు, గిరిజనులకు పునరావాసం అడుగడుగునా క్షణం తీరికలేకుండా ఆయన చేస్తున్న ప్రజా ఉద్యమాలు జనం నెత్తిన పెట్టుకునేలా చేశాయి. ఓవైపు పక్క 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కోలేక చేతులెత్తేస్తే పోటీ చేసిన మొదటి సార్వత్రిక ఎన్నికలతోనే దేశవ్యాప్తంగా ప్రభావవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా నిలిచారు. అధికార పార్టీల ప్రలోభాలకు గురై ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నా వెనక్కి తగ్గని ధీశాలి. కేసులకు భయపడకుండా ప్రజోద్యమాలను రచిస్తున్న అనితర సాధ్యుడు వైయస్‌ జగన్‌ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయాక్తికాదు.

పలు సందర్భాల్లో వైయస్‌ జగన్‌ అన్న మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తాయి. 
* ప్రాణం పోయినా క్యారెక్టర్‌ను అమ్ముకోను
*  ప్రజల్లో మెలగటమే ప్రజా నాయకుడి లక్షణం
* మహానేత ఆశయ సాధనే లక్ష్యం
* 13వ రీల్‌ వరకు విలన్‌దే పైచేయి కావొచ్చు.. చివరికి 14వ రీల్లో గెలిచేది హీరోనే.
* రాజకీయ నాయకులకు వ్యక్తిత్వం, విశ్వసనీయత చాలా ముఖ్యం
* చేసేదే చెప్తాం.. చెప్పింది చేస్తాం.. మాట తప్పం, మడమ తిప్పం
* ప్రజల తరఫున ఉద్యమిస్తాం.. రాజన్న రాజ్యాన్ని నిర్మిస్తాం
* ఎలా బతికామన్నది ముఖ్యంకాదు..బతికినంత కాలం ఎంత గొప్పగా బతికామన్నదే ముఖ్యం
* నాడు నేను, అమ్మ... నేడు జగమంత కుటుంబం
* విశ్వసనీయతే నా ఆయుధం
* జగన్‌ మా నాయకుడు అని కార్యకర్తలు కాలర్‌ ఎగేరేసి గర్వంగా చెప్పుకునేలా బతుకుతా
* పేదల కోసం.. రైతుల కోసం... యువత కోసం.. రాష్ట్రం కోసం.. పోరాటం
Back to Top