గుంటూరు: న్యాయసంస్థలు, న్యాయ వ్యవస్థ అంటే చంద్రబాబుకి చిన్న చూపు అని మరో సారి బయట పడింది. రాజధాని ప్రాంతంలో ఎటువంటి నిర్మాణపు పనులు చేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు.<br/>రాజధాని పేరుతో 33వేల ఎకరాల పంట భూముల్ని లాక్కొన్న చంద్రబాబు..రాక్షసంగా అక్కడ పనులు మొదలెట్టింది. పచ్చని పంటల్ని నాశనం చేసేందుకు రైతులు, కూలీల మీద పగ పట్టింది. వేలాది ఎకరాల్లో పంటల్ని నాశనం చేసుకొంటూ పోతే భవిష్యత్ లో ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని మేధావులు నెత్తీ నోరు కొట్టుకొన్నారు. వ్యవసాయాన్ని దెబ్బ తీస్తే వ్యవస్థకు ఇబ్బంది అని హితవు పలికారు. అయినప్పటికీ పట్టించుకోకుండా చంద్రబాబు రాక్షస క్రీడను పూర్తి చేశారు. <br/>దీన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణ వేత్తుల జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. వేలాది ఎకరాల్లో పంటల్ని నాశనం చేయటంతో పర్యావరణం దెబ్బతింటుందని విన్నవించారు. వాదనల్ని పరిగణనలోకి తీసుకొన్న గ్రీన్ ట్రిబ్యునల్ చదును చేయటం, పంటల్ని నాశనం చేయటం వంటి పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. <br/>కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. యుద్ద ప్రాతిపదికన పంట పొలాల్ని నాశనం చేస్తోంది. దీన్ని వైభవంగా చాటుకొనేందుకు శంకుస్థాపనకే 400 కోట్ల రూపాయిలు ఖర్చు పెడుతోంది. దీని మీద పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం మీద తిరిగి ట్రిబ్యునల్ కే ఫిర్యాదు చేయాలని బావిస్తున్నారు.