సినిమాకెళ్తున్నారా.. జాగ్రత్త


– సినిమా హాళ్లలో చంద్రబాబు ప్రకటనలు
– 130 లఘు చిత్రాలు సిద్ధం చేసిన టీడీపీ
– ఎల్లో మీడియాపై ఆశలొదుకున్న చంద్రబాబు


మింగ మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టుంది చంద్రబాబు తీరు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయరు, ఆరోగ్యశ్రీలో ఉన్న వ్యాధులనున ఒక్కొక్కటిగా తొలగిస్తారు, పక్క రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీని అమలు కానీయరు, ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ మళ్లీ ఎన్నికలొస్తున్నా.. అమలు కాలేదు. కానీ చంద్రబాబు దుబారాకు మాత్రం అడ్డం అదుపూ లేకుండా సాగుతోంది. ప్రత్యేక బస్సు, ప్రత్యేక విమానం, విదేశీ పర్యటనలు, పాత ఇంటికి మరమ్మతులు, కొత్త ఇళ్లు నిర్మాణం, హోటల్‌లో విడిది, హిమాలయా వాటర్‌..  నవ నిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు.. ఇలా తన అవసరాల కోసం చంద్రబాబు ఏది చేసినా దుబారాయే. ఇటీవలే  వై యస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డి వివరాలతో సహా చంద్రబాబు ఖర్చుల వివరాలను లెక్క తేల్చారు. నాలుగేళ్లు తన సొంత అవసరాల కోసం దాదాపు రూ. 6 వేల కోట్లు వరకు ఖర్చు చేశారని ఒక్కో దానిని లెక్కలతో సహా ప్రకటించారు.

ఇప్పుడు చంద్రబాబు తాజాగా మరోసారి తన తన ప్రకటనలతో జనాన్ని హింసించ డానికి సిద్దమయ్యారు. ఇన్నాళ్లు సందర్భం దొరికినప్పుడల్లా పేపర్లు, టీవీల నిండా యాడ్‌లు గుమ్మరించి పచ్చ మీడియాను ఉద్దరించిన చంద్రబాబు ఇకపై కాలక్షేపానికి సినిమాలకు వెళ్లే జనాన్ని కూడా ఓ పట్టు పట్టనున్నాడు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముఖేష్‌ యాడ్‌తోపాటు తన పైత్యాన్ని జనం మీదకు రుద్దేందుకు తయారయ్యాడు. డిజిటల్‌ యాడ్‌లు, లఘు చిత్రాలతో జనాల మైండ్‌ను తొలచేందుకు సమాయత్తం అవుతున్నారు. 130 షార్ట్‌ ఫిల్మ్‌లను సిద్ధం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని వ్యూహ రచన చేస్తున్నారు. నచ్చినా నచ్చకపోయినా ఇకపై చంద్రబాబు తలనొప్పిని భరించాల్సిందే. నాలుగేళ్లలో చేసిందేం లేకపోయినా.. అద్భుతాలు జరిగిపోయినట్టు ఫొటో షాప్, డిజిటల్‌ మార్ఫింగ్‌కు పూనుకుంటున్నారు. ఎల్లో మీడియాను రంగరించి జనం మీదకు ఎంత వదిలినా ఫలితం లేకపోవడంతో తాజాగా టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. 
 
Back to Top