బాబు.. బొంకుడు కలలో మేటి


– ప్రాజెక్టుల నిర్మాణంలో ఘోరంగా విఫలం
– మేలు చేయాలనుకుంటే పెట్రోలుపై ట్యాక్సులు ఎత్తేయాలి
– గ్యాస్‌ ధర రెట్టింపైతే బాబులో స్పందన కరువు 
– నాడు కేంద్రం పెంచిన రూ. 50లు..  భరించిన వైఎస్సార్‌ 

బొంకరా బొంకరా మల్లిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాడంట వెనకటికొకడు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారం దీనికి భిన్నంగా ఏమీ లేదు. దేశంలో ఏ కొత్త ఆవిష్కరణలు జరిగినా అందుకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు.. విమర్శలు వచ్చినప్పుడు మాత్రం పక్కనోళ్ల మీదకు నెట్టేందుఉ ఏమాత్రం వెనకడాడు. గతంలో మోడీ డీమానిటైజేషన్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు నేనే సలహా ఇచ్చానని చెప్పాడు. తీరా డీయానిటైజేషన్‌ నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవడం.. డబ్బుల కోసం జనం ఏటీఎంల ముందర క్యూలు కట్టడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతోపాటు సామాన్యులు డబ్బుల కోసం రోడ్డున పడటం.. డబ్బున్న వారు మాత్రం సంతోషంగానే ఉండటం చూసి పేదోడి కడుపు మండింది. దీంతో చంద్రబాబు వెంటనే ప్రెస్‌మీట్‌ పెట్టేసి నోట్ల రద్దు అనేది ఒక దిక్కుమాలిన నిర్ణయం అని ప్రకటించాడు. నోట్ల రద్దును ప్రకటించిన రోజు.. తానే మోడీకి సూచించానని చెప్పిన నోటితోనే.. వ్యవహార బెడిసి కొట్టేసరికి తిట్టిన నోటితోనే మోడీని పొగిడి తన చేతికి బురద అంటకుండా కాపాడుకునే ప్రయత్నం చేశాడు. ఇదే చంద్రబాబు నోట్ల రద్దును అడ్డం పెట్టుకుని మజ్జిగ పంపిణీ అని హెరిటేజ్‌కు లాభం చేకూర్చుకున్నాడు. 
గ్యాస్‌ ధర రెట్టింపైంది.. 
నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు పెట్రోల్‌ ధరలపై వ్యంగ్యంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో పెట్రోలను వంద రూపాయలు చేస్తారేమో అని. మోడీని విమర్శించే ముందు చంద్రబాబు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాగుండేది. పెట్రోలుపై ప్రతి లీటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం 39.40, డీజిల్‌ పై 31.70 ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తుంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికం. 2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చేనాటికి గ్యాస్‌ ధర 400 ఉండగా ఇప్పటికీ రూ. 850కి చేరింది. అంటే ఈ నాలుగేళ్లలో 108 శాతం ధరలు పెంచిన ఘనత బాబుది. గతంలో ఇలాగే కేంద్రం గ్యాస్‌ ధర రూ. 50లు పెంచితే దానిని తానే భరిస్తానని సబ్సిడీ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌ది. ఇలాంటి ఏ ఒక్క భరోసా కూడా చంద్రబాబు ఇచ్చిన పాపాన పోలేదు. చంద్రబాబు ప్రజల మేలు కోరుకునే వాడే అయ్యుంటే.. పెట్రోలుపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న ట్యాక్సులు ఉపసంహరించుకునేవాడే. గ్యాస్‌ ధర రెట్టింపైనా ఆయనలో కొంచెం కూడా చలనం లేదు. 

ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు...
గడిచిన నాలుగేళ్లలో కొత్తగా ఒక్క ప్రాజెక్టను చేపట్టి పూర్తి చేయలేదు. వైఎస్సార్‌ 90 శాతం పూర్తి చేసిన ముచ్చుమ్రరి, పైడిపాలెం ప్రాజెక్టులకు మెరుగులు దిద్ది పూర్తి చేసినట్టు బిల్డప్‌ ఇచ్చుకున్నాడు. ఈ నాలుగేళ్లలో పోలవరం పేరు చెప్పి డబ్బులు దండుకున్నారు తప్ప.. ప్రాజెక్టును పూర్త చేయలేకపోయారు. నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అనుమతులు వైఎస్సార్‌ సాధించినవే. దాంతోపాటు కాలువ నిర్మాణం పనులు కూడా దాదాపు పూర్తి చేశారు. 60 ఏళ్ల కలను సాకారం చేసేందుకు  ప్రాజెక్టు ప్రారంభించిన వైఎస్సార్‌ మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పనులు కూడా వేగవంతం అయ్యాయి. మహానేత హఠాన్మరణంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. అలాంటి చంద్రబాబు పోలవరం పేరుతో నాలుగేళ్లుగా ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీకావు. ప్రాజెక్టును పూర్తి చేయడం చేతకాక పట్టిసీమ, పురుషోత్తంపట్నం అని రెండుగా విభజించాడు. వైఎస్సార్‌ తవ్వించిన ఎడమ కాలువను పట్టిసీమ, కుడి కాలువను పురుషోత్తం పట్నం అని చెప్పి.. మూడు సార్లు శంకుస్థాపనలు చేసిన ఘనుడు చంద్రబాబు. అంతేనా.. 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని.. ‘రాసిపెట్టుకో జగన్‌’ అంటూ అసెంబ్లీలో మంత్రి ఉమా, చంద్రబాబు భీకర ప్రతిజ్ఞ చేశారు. 2019 వస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు. పూర్తవుతుందని ఆశ కూడా లేదు. తన అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు పోలవరంను మీకే ఇచ్చాస్తామంటూ కేంద్రాన్ని విసుక్కున్నాడు. పోలవరం సంగతలా ఉంటే.. వైఎస్సార్‌ మానస పుత్రిక అయిన వెలిగొండ ప్రాజెక్టులో అవినీతిని ప్రవహింపజేసిన ఘనత చంద్రబాబుదే. ఈ ప్రాజెక్టును కూడా దాదాపు 70 వైఎస్సార్‌ హయాంలోనే పూర్తి చేశారు వైఎస్సార్‌. సాగు, తాగునీటి ప్రాజెక్టులంటేనే ఇష్టపడని చంద్రబాబు.. స్వయంగా తన పుస్తకంలోనే ప్రాజెక్టులు ఎందుకు దండగ అని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి చంద్రబాబు కూడా ఇంధన ధరలు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది. 
Back to Top