పశ్చిమలో అడుగడుగునా బాబు దగా

పశ్చిమ
గోదావరి జిల్లాలో కొనసాగుతున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా
సంకల్పయాత్రలో తమకు చంద్రబాబు చేసిన మోసం గురించి ప్రజలు పెద్ద ఎత్తున వివరిస్తున్నారు.
బాబు మాటలను నమ్మి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన పార్టీనే
గెలిపించినందుకు ప్రతిఫలంగా, తనకే ప్రత్యేకమైన వంచన, దగా  వంటి వాటిని  ప్రజలను కానుకగా ఇచ్చారనే విమర్శలు
వెలువెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపకుండా, అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని
తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ, అధికారంలోకి
వస్తే  సమస్యల పరిష్కారానికి చర్యలు
తీసుకుంటామనే భరోసా కల్పిస్తూ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు జననేత వైయస్ జగన్.

                                                                                  
                                                                                                                                                    

ఆక్వారైతుల
గోడు పట్టని బాబు

గోదావరి
జిల్లాల తీర ప్రాంతాల్లో ఆక్వా సాగు అధికం.
కానీ ఈ రైతుల కష్టాలు పట్టించుకునే నాధుడే లేడు. వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్రలో అత్యధికంగా ఆక్వారైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఆక్వా సాగులో దారుణమైన నష్టాలపాలౌతున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే అందుకు కారణమని చెప్పుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 7లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా
చెరువులు ఉండగా అందులో అధికశాతం ఉభయగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. అభివృద్ధి పరంగా ఆక్వా రంగం దూసుకెళ్తున్నట్టు బాబు లెక్కలు చూపిస్తున్నా,
సాగు చేయడానికి నాణ్యమైన రొయ్యల పిల్లలు లేక ఆక్వారైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
అనుమతిలేని హేచరీలు నాణ్యతలేని సీడ్ ను అంటగట్టి రైతుల నష్టాలకు కారణం
అవుతున్నా సర్కార్ పట్టించుకునే పాపాన పోవడం లేదని ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు.
ఆక్వారైతులు సొంత హేచరీలు నిర్మించుకుని, నాణ్మైన
సీడ్ అభివృద్ధి చేసుకునేప ప్రయత్నం చేసినా చంద్రబాబు సర్కార్ మాత్రం దానికి మోకాలడ్డుతూనే
ఉంది. కోట్లు ఖర్చుపెట్టి నిబంధనల మేర నిర్మించిన హేచరీలను కేంద్ర
ప్రభుత్వ కమిటీలు తనిఖీ చేసి తలూపినా, రాష్ట్రస్థాయిలో మాత్రం
అనుమతులు ఇవ్వడం లేదు. ప్రైవేటు హేచరీలను ప్రోత్సహిస్తూ,
ఆక్వారైతులను నట్టేట ముంచుతోంది చంద్రబాబు ప్రభుత్వం.

గోదారి
తీరంలో నీటికరువు

పేరుకే
గోదావరి జిల్లా..కానీ ఈ ప్రాంత వాసులకు తాగునీరు కరువు. ప్రభుత్వం సరఫరా
చేస్తున్న నీటిని బాటిళ్లతో తెచ్చి ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేతకు చూపిస్తున్నారు
పశ్చిమజిల్లా వాసులు. మురికిగా, దుర్గంధపూరితంగానే
కాదు, ఎక్కువ శాతం ఫ్లోరైడ్ కూడా ఉన్న నీరు ఎలా తాగాలంటూ వాపోయారు.
బోర్లు కూడా ఉప్పునీరే వస్తోందని, కలుషిత నీటితో
రోగాల బారిన పడుతున్నామని తమ గోడు చెప్పుకున్నారు మహిళలు. బాబు
చెప్పిన 2 రూపాయిలకు 20లీటర్ల రక్షిత మంచి
నీరు ఎక్కడా లేదని, మంచి నీటికోసం అల్లాడిపోతున్నామన్నారు పశ్చిమగోదావరి
జిల్లా వాసులు.

నీరు
చెట్టు పేరుతో దోపిడీ

కాలవలు, కుంటల్లో మట్టిని తోడేయడం,
నీరుచెట్టు పేరుతో యంత్రాలతో పనులు చేయించడం, ప్రశ్నించిన
వారిని వేధించడం ఇదీ పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్ల నిర్వాకం. జన్మభూమి కమిటీలు, స్థానిక టిడిపి నేతలు చేస్తున్న మట్టి
దోపిడీ గురించి ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకు వచ్చారు ఆ ప్రాంతవాసులు.

తుందుర్రు
గోస

భీమవరానికి సమీపంలోనితుందుర్రులో ఆక్వాపార్కు
వద్దని పది గ్రామా ప్రజలు నిరసన తెలిపితే, ఈ దుర్మార్గపు పాలకులు
కేసులు పెట్టి 250 మందిని జైల్లో పెట్టారు. ఆడవాళ్లని కూడా చూడకుండా 60 మందిని అరెస్టులు చేసారు. ఈ గ్రామాల
ప్రజలు ఆక్వాపార్కు మాకొద్దంటూ విజయవాడకు నిరసన తెలిపేందుకు బయలు దేరితే, వారిపై లాఠీ చార్జులు
చేసి, ఆ గ్రామాల్లో 144 సెక్షన్ విధించి
బలవంతంగా నిరసనలను అణిచేస్తోంది చంద్రబాబు సర్కార్.

పశ్చిమ
వాసులకు ప్రతిపక్షనేత హామీలు

15 నియోజక వర్గాల ప్రజలు నమ్మి ఓట్లేసి జిల్లా మొత్తాని చంద్రబాబు చేతిలో పెడితే
ఆయన ఈ జిల్లాకు చేసినది శూన్యం అన్నారు వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి
జిల్లా పాదయాత్రలో అడుగడుగునా సమస్యలే పలకరించాయన్నారు. ఆక్వారైతుల
సమస్యలు, కలుషిత నీరు, ఉపాధి పనుల్లో అవకతవకలు,
నిరుద్యోగం, రోడ్లు, డ్రైనేజీ,
ట్రాఫిక్ సమస్యలతో జిల్లా అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. ఆక్వారైతులు, కోల్డ్ స్టోరేజీలకు విద్యుత్ ఛార్జీల భారం
ఎక్కువగా ఉందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే యూనిట్ ఛార్జీలు
తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పంలో ఆక్వా రైతుల సమస్యలపై
చంద్రబాబును ప్రశ్నించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. వైఎస్
జగన్ ఆక్వా రంగానికి ఇచ్చిన హామీలను చూసి బెంబేలెత్తిన చంద్రబాబు, ఉన్నపళంగా ఆక్వారైతులతో సమావేశం నిర్వహించాడు. కంటితుడుపు
హామీలిచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు.

ఇక
ప్రతి ఊరిలో రక్షిత మంచి నీటి స్టోరేజీ ట్యాంకుల నిర్మాణం చేస్తామని అక్కచెల్లెళ్లకు
మాట ఇచ్చారు వైఎస్ జగన్.
సొంత ఆటో ఉన్న డ్రైవర్లుకు ఏడాదికి 10,000 ఇస్తామన్నారు.
మత్స్యకారులకు కార్పోరేషన్ ఏర్పాటు చేసి, కొత్త
బోట్లు రిజిస్ట్రేషన్ చేయిస్తామన్నారు యువనేత. వేట విరామ సంయంలో
ఇచ్చే 4000 రూపాయిలను చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఇవ్వడం లేదని
తెలుసుకున్న ప్రతిపక్ష నేత, అధికారంలోకి రాగానే ఆ మొత్తాన్ని
10,000కు పెంచుతానని మాట ఇచ్చారు. మత్స్యకారుడు
ప్రమాదవశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి 10లక్షలు నష్టపరిహారం
ఇస్తామని హామీ ఇచ్చారు. 

Back to Top