బాబు అఖిలపక్షం డ్రామా


అఖిలపక్ష సమావేశం కాదు అఖిల సంఘ సమావేశం అంటాడు బాబు. రెంటికీ మధ్య తేడా ఏంటయ్యా అంటే...అమ్మకీ...నాన్న భార్యకీ ఉన్నంత తేడా ఉంది మరి అంటాడు. బాబు అనుసరించే ఈ లోపాయికారీ సిద్ధాంతాలను అసహ్యించుకునే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖిల సంఘాల సమావేశానికి హాజరు కావట్లేదని ప్రకటించింది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నమ్మలేమని, విశ్వసనీయత లేని ముఖ్యమంత్రి మాటలు ప్రజలు కానీ, ప్రతిపక్షం కానీ ఎందుకు వినాలని ప్రశ్నించారు వైఎస్ జగన్. హోదా కోసం సమగ్ర కార్యాచరణ చేస్తూ, అవిశ్వాసం దాకా వచ్చి, రాజీనామాలకు సైతం సిద్ధపడ్డ తర్వాత ఇప్పుడు బాబు అఖిలపక్షం పెట్టడంలో ఉన్నది రాజకీయ స్వార్థ దురుద్దేశమే కానీ హోదా కోసం కాదని అన్నారు ధర్మాన. 

బాబు అర్థాంతర అఖిలపక్షం

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యిన పరిస్థితులు చాలా క్లిష్టమైనవి. ఆ సమయంలో రాష్ట్రం ఎన్నో సమస్యలతో ఒంటరి పోరు చేస్తోంది. ఆంధ్రులు పునర్విభజన కారణంగా ఆవేదనతో, ఆవేశంతో ఉన్న సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు చంద్రబాబు. మోదీ హవాను, మెజారిటీ కులానికి చెందిన హీరోనూ వెంటేసుకుని, తన అనుభవంతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఓట్లేయించుకున్నాడు. ప్రజల ఎమోషన్ ను క్యాష్ చేసుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో చంద్రబాబు ఏకపక్షంగానే వ్యవహరించాడు. అటు ప్రజలను కానీ, ఇటు ఇతర విపక్షాలను కానీ సంప్రదించనే లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు తనక నచ్చిన రీతిలో బాబు రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన నిర్ణయాలన్నీ స్వయంగా తీసేసుకున్నాడు. రాజధాని నిర్ణయం విషయంలో కానీ, భూముల సమీకరణ కానీ, కేంద్రం చేపట్టాల్సిన పోలవరాన్ని రాష్ట్రానికి బదలాయించుకున్నప్పుడు కానీ, ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు కానీ .... బాబు అఖిల పక్షాల సమావేశం ఏర్పాటు చేయనేలేదు. ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయం కోరలేదు. తాను నిర్ణయించిందే చట్టంలా నియంతృత్వ పోకడలు ప్రదర్శించాడు. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వ్యవహారాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఏకపక్షంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని పలుమార్లు ప్రజాసముఖంలో తెలియజేసారు. 

ప్రభుత్వమే కానీ ప్రతిపక్షం లేదన్న బాబు 

బాబు అధికారం చేప్పట్టిన మొదట్లోనే రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు కాంగ్రెస్ తో పాటు ఇతర కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును అఖిలపక్షం ఏర్పాటు చేయమని డిమాండ్ చేసాయి. కానీ అప్పటికి అధికారం ఉందన్న గొప్పలో బాబు రాష్ట్రంలో టిడిపి తప్ప మరో పార్టీ లేదని, ఉండాల్సిన పని కూడా లేదని తన అహంకారాన్ని ప్రదర్శించాడు. నేడు రాష్ట్రం మొత్తం హోదా జ్వాల రగులుతోంది. రాష్ట్రానికి జరిగిన నష్టం పై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు, అవసరమైతే పోరాడేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తన శక్తిని ధారపోస్తోంది. ప్రజల్లో ప్రతిపక్ష పార్టీకి దక్కుతున్న ఆదరాభిమానాలు చూసాక, ఎన్నికల దగ్గర పడ్డాక బాబుకు రాష్ట్రంలో తను కాక వేరే పార్టీలు కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుకు వచ్చింది. ప్రజల ముందు డ్రామా కోసం, హోదాకై పోరాడుతున్నాననే క్రెడిట్ కోసం తన భాగస్వామ్య ఎన్డీయే నుంచి నిష్క్రమించినా హోదా అంత సులభంగా రాదని బాబుకు తెలుసు. అందుకే ఇప్పుడు అఖిల పక్షాలంటూ విపక్షాలను పిలిచి, వారిని కూడగట్టింది నేనే అని, హోదా కోసం ఎంతో చేసానని చెప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. 

బాబు స్వార్థ పక్షం

అఖిలసంఘంలో చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చిడం కోసం వివిధ పార్టీలను, ప్రజా సంఘాలను పిలిచానని ప్రచారం చేసుకున్నాడు. కానీ పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ జరగని కారణంగా, నిరవధిక వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నందున ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించింది. సభ వాయిదా పడుతుందని తెలిస్తే ఎమ్.పి లు అందరూ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ తమ పార్టీ చేయబోయే కార్యాచరణను కొద్ది రోజుల ముందు నుంచీ ప్రజల సమక్షంలో వివరిస్తూ వస్తున్నారు. అదే ప్రకారంగా పార్లమెంట్ వాయిదా ఉంటుందని తెలిస్తే వెంటనే ఎమ్.పిలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. అంతేకాక టిడిపి ఎమ్.పిలు కూడా రాజీనామా చేయాలని, అప్పుడే కేంద్రం దిగివస్తుందని సూచించారు. లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని టిడిపిని హెచ్చరించారు. దాంతో చంద్రబాబు అమాంతం అఖిలపక్షానికి పిలుపునిచ్చాడు. అయితే అది అఖిలపక్షం కాదని, అఖిల సంఘాల సమావేశం అని తన స్టాటజీలో చెప్పుకొచ్చారు. రాత్రికి  రాత్రి అర్థంతరంగా నిర్ణయించిన ఈ సమావేశానికి ప్రతిపక్ష వైయస్ఆర్  కాంగ్రెస్ హాజరు కావడం లేదని తెలిపింది. పూటకో మాట చెప్పే ముఖ్యమంత్రిని నమ్మలేమని ప్రకటించింది. నిన్నటి దాకా మిత్ర పక్షంగా ఉన్న బిజెపి, జనసేనలు కూడా బాబూ అఖిలసంఘాన్ని లెక్క చేయలేదు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎమ్, లోక్ సత్తా, ఉద్యోగ సంఘాలు ఈ భేటీకి హాజరయ్యాయి. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు అందుకున్న నవతరం, ముస్లింలీగ్, వైఎస్సార్ ప్రజా పార్టీకి సంబంధించన నేతలు సమావేశానికి వస్తే, నిర్దాక్ష్యణ్యింగా వారిని బైటికి పంపిచడంతో, సమావేశం బైట వారంతా ఆందోళనకు దిగారు. ఇటీవలే ముస్లింలతో భేటీ అయి, త్రిపుల్ తలాక్ పై ముందు నేనే స్పందిచాను అని  చెప్పిన బాబు సమావేశానికి వచ్చిన ముస్లిం లీగ్ ప్రతినిధులను బైటకు గెంటించడం పట్ల వారు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. బాబు మాటకి, చేతలకీ పొంతనుండదని పిలిచి, ఇలా బైటకు పండమేంటని వారంతా సిఎమ్ కార్యాలయం ముందే నిరసన వ్యక్తం చేసారు. 

తన పుట్టి మునుగుతోందన్నప్పుడే చంద్రబాబుకు ఇతరుల సాయం కావాల్సి వస్తుందని అర్థం అవుతుంది. కేంద్రంతో పోరాడేందుకు మిగితా పార్టీలను కలుపుకుపోవాలనుకుంటున్నాడు బాబు. కానీ అవిశ్వాసం అప్పుడు బాబు మడత పేచీని ఎవ్వరూ మరిచిపోలేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పెడుతున్న అవిశ్వాసానికి మద్దతిస్తానని ప్రకటించి, మర్నాడే ప్లేటు ఫిరాయించిన ఘనుడు బాబు.

Back to Top