కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట వల్ల హైకమాండ్ స్పందించి ఢిల్లీ కి పిలిచి చివాట్లు పెట్టిన తర్వాత రాబోయే ఉప ఎన్నికలు పోస్ట్ఫోన్ చేస్తే గెలుస్తామని అనుకుంటున్నారు.ఈ రెండు మూడు రోజులు ఢిల్లీ లో లాబీలు చేసి ఎలక్షన్ కమిటినీ ఒప్పించే విదంగా కుట్ర జరుపుతున్నారు. రాష్ట్రంలో సర్వేలు చేసే ఓ ఏం.పి. మాట్లాడుతూ ఈ పిచ్చి ప్రజలు జగన్మోహన్ రెడ్డి కి ఓ సారి ఓటేస్తే ప్రేమ పోతుందని అంటున్నారు. స్థానిక ఎన్నికలు జరిపితే జగన్మోహన్ రెడ్డి కి ఓటేస్తారు. రాబోయే 18 ఉపఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ కే ఓటు వేస్తారు.అలాగే 2014 లో జరిగే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ కే ఓటేద్దాం అని ప్రజలు ఫిక్స్ అయ్యారు.ప్రతిపక్షం లో చంద్రబాబునాయుడు గారు అధికార పక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కై ప్రతిదాంట్లో కమీషన్లు తీసుకుంటూ అవనీతి కి పాల్పడుతున్నది వాళ్ళు. ప్రజలఫై నమ్మకం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాతీర్పు కి ఎప్పుడు మేము కట్టుబడి ఉంటాం ప్రజా నిర్ణయాలకు అనుకూలంగా పనిచేస్తామని మాట ఇవ్వడం జరిగింది. శ్రీనివాసరెడ్డి అనే అధికారి మద్యం మాఫియా ఫై వాస్తవాలు చెబుతుంటే అధికారిని బదిలీ చేస్తారు. మరి చట్టం తన పని తానూ చేసుక పోతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. విజయనగరం లో జరిగిన సంగటనలు ప్రముఖ పత్రికల్లో వచ్చాయి.గతంలో ఎన్నడు లేని విధం గా ఈ రెండు పార్టీ లు కలసి అసెంబ్లీ ని నాసనం చేసాయి. మిలటరీ వ్యవస్థ ఫై చాల గౌరవం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత మిలిటరీ మీద ఒక్క కంప్లైంట్ రాలేదు. ఒక ఇంగ్లీష్ పత్రిక ప్రచురించింది మిలటరీ బలగాలు ఢిల్లీ వైపు కదిలాయని.నిజానిజాలు మనకు తెలియదు కాని వెంటనే ప్రదానమంత్రి ,సంబందిత మంత్రి అందరు మాట్లాడారు అది నిజం కాదు అని. ఇంత వీక్ లీడర్స్ ఉండటం వల్ల్రే ఇవన్ని జరుగుతున్నాయ్ అని మేము భావిస్తున్నాం.రాష్ట్రం లో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే సిగ్గు పడుతున్నాం. ఒక మాట ఇస్తున్నాం యువత గాని రైతులు గాని ఈ దేశం ఫై ఉన్న గౌరవం గాని వ్యవస్థని గౌరవించే వాల్లకి గాని చెబుతున్న మాట మేము ప్రజా వ్యతిరేకం గా పాలన చేయం ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగుతుంది మా నాయకుడి యొక్క కృషి కుడా అలాగే ఉంటుంది. కాంగ్రెస్ తెలుగు దేశం చేస్తున్న కుట్రలను ప్రజలు అర్ధం చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు అధికారం లో ఉండగా 2014 దాక మేము ఎటువంటి చార్గీలు పెంచమని చెప్పారు. కాని ఇప్పుడు 4500 కోట్లు భారం ప్రజలఫై మోపారు.ఆర్.టి.సి. చార్జీలు పెంచారు, ప్రతి ఒక్క చార్జీలు పెంచి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసారు. 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని రాజశేఖర్ రెడ్డి గారు చెబితే అసలు అమలు చేయడంలేదు.