వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు


ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పొగాకు రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. సాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సాగునీరు లేక పంట దిగుబడులు తగ్గుతున్నాయని చెప్పారు. రేపటి నుంచి జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం అవుతున్నాయని, కనీస మద్దతు ధర రూ.7 వేలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేద్దామని వైయస్‌ జగన్‌ రైతులకు సూచించారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top