కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రభుత్వ ఉపాధ్యాయులు సంఘీభావం తెలిపారు. మంగళవారం వైయస్ జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్. కైరవడి వద్ద ఉపాధ్యాయులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రధానంగా సీపీఎస్ విధానం రద్దు చేస్తామని ఇదివరకే వైయస్ జగన్ ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.<br/>