క్షత్రియులకు కార్పొరేషన్..ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ...
విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో రాష్టీ్రయ క్షత్రియ సంఘం ప్రతినిధులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.రాజకీయ ప్రాధ్యాన్యత కల్పించాలని కోరుతూ పలు సమస్యలు జననేతకు దృష్టికి తీసుకెళ్ళారు. క్షత్రియులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.రాయలసీమ నాలుగు నియోజకవర్గాల నుంచి వైయస్ జగన్‌కు మద్దతు తెలపడానికి వచ్చినట్లు తెలిపారు.రాయలసీమ రాజులకు సముచిత స్థానం కల్పిస్తానని వైయస్ జగన్ తెలిపారన్నారు.ఈ సందర్భంగా క్షత్రియ ప్రతినిధులు వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.