వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన డ్వాక్రా మ‌హిళ‌లు


ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాల రుణాలు, రైతు రుణాలు రద్దు చేస్తామని చెప్పి నమ్మించి మోసం చేశార‌ని వాపోయారు.  అధికారంలోకి వచ్చిన తరువాత మమ్మల్ని ముంచారని  డ్వాక్రా సంఘ సభ్యులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తాము రూ.మూడు లక్షల వరకు రుణాలు తీసుకున్నామని, అసలు, వడ్డీ కలిపి ఎక్కువై కూర్చొందన్నారు.  వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్ ..మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌చ్చాక మీ అప్పంతా నాలుగు ధ‌పాలుగా మాఫీ చేసి మీ చేతుల్లోనే పెడ‌తాన‌ని మాట ఇచ్చారు.
Back to Top