త‌ణుకు నుంచి 182వ రోజు పాద‌యాత్ర ప్రారంభం
 
పశ్చిమ గోదావరి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బయలుదేరారు. తణుకు శివారు నుంచి  ప్రారంభ‌మైన పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్‌ రోడ్డు చేరుకున్న తర్వాత వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత ఈరోజు పాదయాత్ర ముగుస్తోంది.   
Back to Top