కర్నూలు : వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా 17వ రోజు శనివారం ఉదయం 8.30 గంటలకు వైయస్ జగన్ తన పాదయాత్రను మొదలుపెట్టారు. ఇవాళ వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్, తొగరచేడు క్రాస్ వద్దకు వైయస్ జగన్ చేరుకుంటారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగనున్నారు. భోజన విరామం అనంతరం కృష్ణగిరి నుంచి పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 6.30 గంటలకు రామకృష్ణ పురం చేరుకుంటారు. <br/><br/><br/><br/>