ఉత్సాహంగా వైయస్ఆర్ కుటుంబం

వి.సావరం (రాయవరం) : వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమం రాయవరం మండలం వి.సావరంలో శనివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. వైయస్సార్‌ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని చెక్కా నాగేశ్వరరావు, చెక్కా రాముకు సభ్యత్వాన్ని అందజేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టాభిరామయ్యచౌదరి మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో వైయస్సార్‌సీపీకి అండగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలుతగా స్థానిక పార్వతీ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో పట్టాభిరామయ్యచౌదరి  పూజలు నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు గ్రామంలో పర్యటించి వైయస్సార్‌ కుటుంబ కార్యక్రమంలో గ్రామస్తులను సభ్యులుగా చేర్పించారు. నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. నదురుబాదలో ఎంపీటీసీ సిరిపురపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైయస్సార్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. మె

తాజా ఫోటోలు

Back to Top