"వైయస్ఆర్ కుటుంబం" సభ్యత్వ నమోదు

గిద్దలూరు రూరల్‌ః వైయస్సార్‌ సీపీ నియోజకవర్గం సమన్వయకర్త ఐ.వి.రెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అంభవరం గ్రామంలో బుధవారం వైయస్సార్‌ కుటుంబం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.  జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి బూత్‌కమిటి వారు వివరించారు. 9121091210 నెంబరుకు ప్రతి ఒక్కరు మిస్డ్‌ కాల్‌ చేయాలని వారు ప్రజలకు తెలియజేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను నిలువునా మోసగిస్తున్న తీరును వారు వివరించారు. అబద్ధాల హామీలతో అడ్డదారిన అందలమెక్కిన చంద్రబాబుకు ప్రజలు తమ అమూల్యమైన ఓటు హక్కుతో త్వరలో బుద్దిచెప్పాలని ఆయన కోరారు. చంద్రబాబు అబద్దాల హామీలకు చెందిన కరపత్రాలను పంపిణీ చేశారు. దివంగత నేత వైయస్‌.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టిడిపి ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు. కార్యక్రమంలో బూత్‌కమిటి సభ్యులు సత్యంరెడ్డి, ఎద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఎన్‌.బ్రహ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
................................................
నవరత్నాలతో వైయస్‌ఆర్‌ సీపీ విజయం తథ్యం
సంగంః వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిరుపేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ది కోసం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం తధ్యమని మండల కన్వీనర్‌ కంటాబత్తిన రఘునాధరెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. సంగం మండలంలోని తలుపూరుపాడులో ఆ గ్రామ పార్టీ నేత కరీముల్లా, బూత్‌ కన్వీనర్‌ మహబూబ్‌బాష, చోటేసాహెబ్‌ల ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి నవరత్న పథకాలను వివరిస్తూ ఇళ్లకు వైయస్‌ఆర్‌ కుటుంబం స్టిక్కర్లు అతికిస్తూ 9121091210కు  ఫోన్‌ చేయించి సభ్యత్వాలు నమోదు చేయించారు. ఇళ్లకు వెళ్లిన సమయంలో ముస్లీం సోదరులు, గిరిజనుల కళ్లలో ఆనందం గుర్తించామని అన్నారు. గ్రామంలో 50 గృహాలకు వెళ్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన నవరత్నాల పథకాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించామని అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే గ్రామీణ ప్రాంత ప్రజల మన్ననలు ఉన్నాయని, 2019లో జరగబోయే ఎన్నికల్లో విజయం తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దగుమాటి మధుసూధన్‌రెడ్డి, తలుపూరుపాడు గ్రామ నాయకులు భాస్కర్, ఖాదర్‌బాష, కరీముల్లా, పెంచలప్రసాద్, అన్వర్, నజీర్, ముత్యాలయ్య, మస్తాన్‌సాహెబ్, హఠేల్‌ సాహెబ్, తదితరులు ఉన్నారు.
...................................................

రేగులపాడులో ఉత్సాహంగా వైయస్‌ఆర్‌ కుటుంబం
నవరత్నాలపై విస్తృత ప్రచారం
కూనవరం:మండల పరిధిలోని రేగులపాడు, ఆర్వాయిగూడెంలో బుధవారం వైయస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. బూత్‌ కన్వీనర్లు కుంజా పొట్టి, కుంజా బాయమ్మల ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో వైయస్సార్‌సీపీ బీసీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఆవుల మరియాదాస్‌ మాట్లాడుతూ.... వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో జగన్‌మొహన్‌రెడ్డికి తోడుగా ప్రతి కార్యకర్త ఇంటింటికీ, మనిషి మనిషికీ నవరత్నాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇంటింటా స్టిక్కర్లు అంటించారు. నవరత్నాల కరపత్రాలను పంపిణిచేశారు. మిస్డ్‌ కాల్‌తో 45 మందిని వైయస్సార్‌ కుటుంబంలో మమేకం చేశారు. ఈకార్యక్రమంలో వైయస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యులు పూసం ప్రసాద్, యూత్‌ మండల కన్వీనర్‌ సోందె పాపారావు, బూత్‌ కమిటీ సభ్యులు పైదా నారాయణ, తుర్రం తమ్మయ్య, దుర్వా రాంబాబు, బొగ్గా రమేష్, మడివి దేశయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top