ఉత్సాహంగా "వైయస్ఆర్ కుటుంబం"

పివి పురంలో ఇంటింటికీ వైయస్ఆర్ కుటుంబం
గంగాధరనెల్లూరుః మండలంలోని పాతవెంకటాపురం గ్రామంలో బుధవారం అమ్ములు ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్ళి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. తలుపులకు స్టిక్కర్లను అంటించారు. 

ప్రతి ఇంటికి మంచి రోజులు వస్తాయ్
చిత్తూరు రూరల్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి మంచి రోజులు వస్తాయని వైయస్సార్ పార్టీ నాయకులు ఇంటింటికీ నవరత్నాలపై అవగాహన కల్పించారు. చిత్తూరు మండలం కుర్చివేడు గ్రామంలో బుధవారం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.ఎస్ బాబు ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబ కార్యక్రమాన్ని కొనసాగించారు. నవరత్నాల పత్రంలో ఉన్న విషయాలను గ్రామస్తులకు వివరించారు. ప్రతి ఇంటికీ వైయస్సార్ కుటుంబ స్టికర్లను అతికించి, వైయస్సార్ కుటుంబంలో చేరాలని కోరారు. ఈ మేరకు చాలా మంది కుటుంబంలో చేరేందుకు ఆసక్తి కనబచారు. 

వైయస్సార్ కుటుంబ సభ్యులవ్వండి
నగరి :వైయస్సార్ కుటుంబ సభ్యులవ్వండి అంటూ మండలంలోని తడుకుపేట గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల పథకాలను వివరించారు. మూడేళ్లలో పాలక ప్రభుత్వం ఏ అభివృద్ధి పనులు చేపట్టకపోవడాన్ని ప్రజలకు ఎత్తిచూపారు. ప్రజలను వైయస్సార్ కుటుంబంలో మమేకం చేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు కన్నియప్పన్, వాసుశెట్టి, ముత్తువేలు రెడ్డి, సంపత్రామ్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top