రాష్ట్రాన్ని మళ్లీ చంద్రబాబు చేతుల్లో పెడితే సర్వనాశనమే..

చంద్రబాబుది రోజులో మోసం..పూటకో అబద్ధం..

మోసం చేసిన బాబును మీ బాకీ తీర్చమని అడగండి..

వైయస్‌ర్‌సీపీకి  ఎవరితోనూ పొత్తుపెట్టుకునే అవసరం లేదు..

రాజన్న రాజ్యంలో సంక్షేమాన్ని గుర్తుకుతెచ్చుకోండి

పెద్దకూరపాడు  ఎన్నికల సభలో  వైయస్‌ షర్మిల

గుంటూరు జిల్లా: చంద్రబాబు చేతుల్లో మళ్లీ మన రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేసేస్తాడని వైయస్‌ షర్మిల అన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు.చంద్రబాబు పాలనలో తెలుగుదేశం నాయకులు తప్ప ఎవరూ కూడా సంతోషంగా లేరన్నారు.ఓటు వేసే ముందు ఒకసారి మన రాజన్నను తలుచుకోవాలని,ఆయన పాలనను గుర్తుతెచ్చుకోవాలని కోరారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే 

వైయస్‌ఆర్‌ హయాంలో ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉండేది,ప్రతి రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది.ప్రతి మహిళ భరోసా పొందేది.ప్రతి యువత పెద్ద చదువులు చదువుకునేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది.పేదవారు కార్పొరేట్‌ వైద్యం చేయించునే ఆరోగ్యశ్రీ ఉండేది.కుయ్‌ కుయ్‌ అంటూ 108 అంబులెన్స్‌ ఉండేది.కులం,మతం,ప్రాంతాలు,పార్టీలు చూడలేదు. ప్రతి ఒక్కరికి మేలు చేసిన నాయకుడు వైయస్‌ఆర్‌.చంద్రబాబు పాలనలో  ఏవర్గమైనా సంతోషంగా ఉన్నారా..ఒక తెలుగుదేశం నాయకులు తప్ప ఎవరైనా సంతోషంగా ఉన్నారా..రైతులకు పూర్తి రుణమాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాడు.డ్వాక్రారుణాలు మొత్తం మాఫీ చేస్తానని వాగ్ధానం చేశాడు.ఒక రూపాయి కూడా మాఫీ చేయలేదు. నేడు పసుపు–కుంకుమ అంటూ మోసం చేస్తున్నారు.మహిళలు మోసపోవద్దు.కాలేజి పిల్లలకు కేజీ నుంచి పీజీ వరుకు ఉచిత విద్య అన్నాడు.ఫీజులు కట్టలేక తల్లిదండ్రలు అప్పుల పాలు అవుతున్నారని, ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు.ఆరోగ్యశ్రీలో ఏ ఆసుప్రతికి వెళ్లడానికి లేదు.గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్లమని చంద్రబాబు శాసిస్తున్నాడు.

చంద్రబాబుకు జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తాడు.గవర్నమెంట్‌ ఆసుపత్రికి  వెళ్తాడా..పేదవాడిని గవర్నమెంట్‌ ఆసుప్రతికి వెళ్లమనడం అమానుషం కాదా..బాబు వస్తే జాబు వస్తుంది అన్నారు..జాబు ఎవరికి వచ్చింది.మీ పిల్లలకు వచ్చిందా..చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు  మాత్రం వచ్చింది. పప్పుగాడికి కనీసం జయంతి,వర్ధంతికి కూడా తేడా తెలియదు.అ,ఆ లు  రావుకాని అగ్రతాంబూలం నాకే అన్నాడట ఒక్కడు..ఒక ఎన్నిక కూడా గెలవలేదు.ఏ అనుభవం,అర్హత ఉందని ఒకటికాదు రెండు కాదు ఏకంగా మూడు శాఖలకు మంత్రిని  చేశారు.చంద్రబాబు కొడుకుకు మూడు ఉద్యోగాలు,సామాన్యులకు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు.బాబు,మోదీ జోడిలు కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదాను ఎగ్గొటేశారు.చంద్రబాబు ప్రత్యేకహోదాను నీరుగార్చడానికి చేయ్యని ప్రయత్నం లేదు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రత్యేకహోదా అంటున్నాడు.ఎన్నికల అయిన తర్వాత ప్యాకేజీ అన్నాడు.మళ్లీ నేడు హోదా అంటున్నాడు.రేపు ఏమంటాడో చంద్రబాబుకు కూడా తెలియదు.గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు.నేడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు.చంద్రబాబుకు రోజుకో మాట.పూటకో అబద్ధం..చంద్రబాబు మార్చే రంగులు చూసి ఉసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది.కేసీఆర్‌తో పొత్తుపెట్టుకోవడానికి వెంపర్లాడింది చంద్రబాబు..ఇప్పుడు వైయస్‌ఆర్‌సీపీకి పొత్తు ఉందని ఆరోపిస్తున్నారు.మాకు ఎవరితోనూ పొత్తు లేదు.అవసరం కూడా లేదు.సింహం సింగిల్‌గానే వస్తోంది.బంపర్‌ మెజార్టీతో గెలుస్తున్నారని ప్రతి సర్వే చెబుతోంది.

సొంతమామను వెన్నుపోటు పోడిచినవాడు చంద్రబాబు.ఎన్టీఆర్‌ పార్టీని,అధికారానికి లాగేసుకున్నాడు. చంద్రబాబుకు మించిన నీచుడు,దుర్మార్గుడు ఇంకోకడు ఉండడని చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ అన్న మాటలు..వ్యవసాయాన్ని దండగ అన్నాడు.ఉచిత విద్యుత్‌ను హేళన చేశాడు.అప్పుల పాలైన రైతులు ఆందోళన  చేస్తే బషిర్‌బాగ్‌లో పిట్టల్ని కాల్చేసినట్లు కాల్చేశాడు.గుండెలేని వాడు చంద్రబాబు.గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని ఒకటి కూడా నిలబెట్టుకోలేదు.నిన్ను నమ్మం బాబు అని చెప్పండి.గత నాలుగున్నరేళ్లు రాష్ట్రానికి ఏమి చేయలేదు కాని, నేడు పసుపు–కుంకుమ అంట..పెన్షన్‌ పెంపు అంట..భృతి అంటూ చేపలకు ఎరవేసినట్లు వేస్తున్నాడు.చిన్న పిల్లలకు చాకెట్లు ఇచ్చినట్లు ఇస్తే సరిపోతుందా..ఆడపిల్ల పుడితే 25వేల రూపాయలు ఇస్తానన్నారు ఎవరికైనా ఇచ్చారా.ఆ బాకీ తీర్చమని అడగండి..కాలేజి పిల్లలను ఐప్యాడ్‌ ఇస్తానని వాగ్ధానం చేశారు..ఎన్నికల లోపు ఐప్యాడ్‌ ఇవ్వమని అడగండి..మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానని వాగ్ధానం చేశాడు..ఎన్నికల లోపు స్మార్ట్‌ఫోన్లు ఇవ్వమని హక్కుగా అడగండి..ఇంటికోక ఉద్యోగం లేదా 2వేల భృతి అన్నాడు..ఇవ్వలేదు..ప్రతి ఇంటికి చంద్రబాబు లక్షా 20 వేలు రూపాయలు బాకీ ఉన్నాడు..అడగండి..పేదలందరికి మూడు సెంట్ల భూమి అన్నాడు..పక్కా ఇళ్లు అన్నాడు..విశాఖ,అమరావతిలో వేల ఎకరాలు స్వాహా చేశాడు..ఆ భూమీ అంతా మీదే అడగండి..రాసి ఇవ్వమని అడగండి..రైతులకు,చేనేతలకు,మహిళలకు,మరమగ్గాలు ఉన్నవారికి రుణమాఫీ చేస్తానని వాగ్ధానం చేశాడు..చంద్రబాబు మీ బాకీ తీర్చమని అడగండి..ఎన్నికలు వస్తున్నాయి. మీ ఓటును డబ్బుపెట్టి కొనాలని చంద్రబాబు అనుకుంటున్నాడు..ఉంత డబ్బు ఇచ్చిన తీసుకోండి..మీ బాకీకి ఆయన ఎంత ఇచ్చిన సరిపోదు.హక్కుగా అడగండి..మీ భవిష్యత్‌ నా బాధ్యత అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు దొంగభాబు..నమ్ముతారా.. మీ భవిష్యత్‌ మళ్లీ చంద్రబాబు చేతిలో పెడితే నాశనం చేసేస్తాడు..

అమరావతి రాదు..ఆంధ్ర పాతాళానికి పోతోంది. దయ చేసి ఆ పొరపాటు చేయకండి..మీ ఓటు ఆంధ్ర అభివృద్ధికి చాలా కీలకం..బైబై బాబు అని చెప్పండి..రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సీఎం అయిన తర్వాత ప్రతి రైతు రాజు అవుతాడు..ప్రతి సంవత్సరం మే నెలలో పెట్టుబడి క్రింద 12,500 ఇస్తారు..నాలుగు ఏళ్లలో 50వేల రూపాయలు ఇస్తాడు.ప్రతి మహిళ తన పిల్లలను బడికి పంపితే 15వేలు ఇస్తారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75వేలు ఆర్థిక సాయం చేస్తారు.డ్వాక్రా రుణాలను మొత్తం నాలుగు దఫాల్లో మాఫీ చేసి మీ చేతుల్లోనే డబ్బులు పెడతారు.సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు.అవ్వతాతాలకు పింఛన్లు మూడువేల నుంచి క్రమంగా పెంచుకుంటూ పోతారు.ప్రతి పేదవాడికి పక్కాఇళ్లు కడతారు.పోలవరం సహా ప్రతి ఎకరాకు నీరు ఇస్తారు. రాజన్న రాజ్యం తెచ్చుకుందాం..ఓటు వేసే సమయంలో ఒకసారి రాజన్నను తలచుకోండి. ఆయన బిడ్డకు ఒకసారి అవకాశం ఇవ్వండి.ఫ్యాన్‌ గుర్తుకే  ఓటు వేయాలని కోరారు.

 

Back to Top