బాబు వచ్చాక అన్నీ కష్టాలే

రాజమండ్రిః చౌక ధరల దుకాణం వద్ద వేలిముద్రలు పడకపోవడంతో రాత్రి, పగలనక సరుకుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని 36వ డివిజన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వైయస్సార్సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు 36వ డివిజన్ లో పర్యటించారు. ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి ఒకటే మాట...గతంలో వైయస్ఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్పితే ఇప్పుడు ఏవీ అందడం లేదని చెబుతున్నారని రౌతు అన్నారు. చంద్రబాబు వచ్చాక తమకు ఏ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలే తమకు వివరిస్తున్నారని చెప్పారు. రాజన్న పాలన వైయస్సార్సీపీతోనే సాధ్యమని ప్రతీ ఒక్కరూ విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు.


Back to Top