అధైర్య‌ప‌డొద్దు

ప్ర‌కాశం: చ‌ంద్ర‌బాబు హామీల‌తో మోసపోయిన ప్ర‌జ‌లు అధైర్య‌ప‌డోద్ద‌ని, త్వ‌ర‌లోనే మంచి రోజులు వ‌స్తాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు భ‌రోసా క‌ల్పిస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపుమేర‌కు  ప్ర‌కాశం జిల్లాలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. గిద్ద‌లూరు నియ‌జ‌క‌వ‌ర్గం అర్థ‌వీడు మండ‌లం  మోహద్దిన్ పురం గ్రామంలో 2వ రోజు గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నియోజకవర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త ఐ.వి.రెడ్డి నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు అమ‌లుకు సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వ‌చ్చాక వాటిని విస్మ‌రించార‌న్నారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామ‌ని మోసం చేశార‌న్నారు. ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌న్న చంద్ర‌బాబు మాట త‌ప్పార‌న్నారు. ఇలా అన్ని వ‌ర్గాల‌ను మోసం చేసిన టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప్ర‌జా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని, వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

-క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం పామూరు మండ‌లం తూర్పు క‌ట్ట‌కింద‌ప‌ల్లె గ్రామంలోని ఎస్సీ కాల‌నీలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త బుర్రా మ‌ధుసూద‌న్ ఆధ్వ‌ర్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా బ్యాలెట్ పంపిణీ చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌పై ప్ర‌జ‌ల చేత మార్కులు వేయించారు.
Back to Top