సహాయక చర్యల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు

మరోసారి నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షాలు, వరదలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.  ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు అండగా నిలుస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు జిల్లాల పార్టీనేతలతో వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. 

ఇటీవల  కురిసిన వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే ప్రకృతి మిగిల్చిన బాధ నుంచి తేరుకుంటున్న సమయంలో...మరోసారి వర్షాలు బీభత్సం సృష్టించడం జీర్ణించుకోలేకపోతున్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. వరదలతో గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతుంటే చంద్రబాబు ఏసీ హోటళ్లలో జపాన్, సింగపూర్ అంటూ మీటింగ్ లతో కాలక్షేపం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Back to Top