గడగడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ గడపగడపకు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.  ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్  పోలాకి మండలం రాళ్లపాడు గ్రామంలో ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు.  స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో ఏకపక్ష ధోరణులను ప్రజలు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు జీవితమంతా మోసపూరిత రాజకీయాలేనని ధర్మాన మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాసమస్యలను గాలికొదిలి... చంద్రబాబు మంత్రులతో  బ్రోకర్ పనులు చేయిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ అరాచకాలను ప్రజల సమక్షంలో ఎంగడతామన్నారు. ఈసందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ ప్రచురించిన కరపత్రాన్ని పార్టీ నేతలు పంచిపెట్టారు.

Back to Top