వైఎస్సార్సీపీ నేత ప్రజాసేవ

అనంతపురంః పాలకులు, అధికారులు మొద్దు నిద్ర వహించడంతో నగరంలో ఎక్కడిచెత్త అక్కడే పేరుకుపోయింది. చెత్తను తొలగించేందుకు అధికారులు ముందుకు రాకపోవడంతో...న్యూసిటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మూడవ డివిజన్ కార్పొరేటర్ బోయ గిరిజమ్మ సొంత ఖర్చులతో చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శాంతి నర్సింగ్ హోం వద్ద నెలల తరబడి చెత్త పేరుకుపోయింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కార్పొరేటర్ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముందుకొచ్చారు. ఆమె సేవ పట్ల  స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top