దర్యాప్తులను శాసిస్తున్నదెవరు?

 
– మంత్రి కాల్వ శ్రీనివాస్‌ మాట్లాడిన తీరు దురదృష్టకరం
– టీడీపీది పాదయాత్ర ఆపించేయాలన్న ధ్యాసే
– పరిటాల రవి హత్యపై సీబీఐ దర్యాప్తు కోరిందెవరు?
– రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకనే జెడ్‌ ప్లస్‌ భద్రత పెట్టుకున్నారా?
– సిట్‌ అంటేనే నేరస్థులు ఊపిరి పీల్చుకున్నట్లు తయారైంది. 
– సిట్‌ నివేదిక బయటకు రాకుండానే ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తారు
– ఓటుకు కోట్లు కేసులో ఫోన్ల ట్యాపింగ్‌పై వేసిన సిట్‌ దర్యాప్తు ఏమైంది?
– అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారు.
– ఏపీ పోలీసుల క్రెడిబిలిటీ మార్చింది మీరు కాదా?
– రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్‌ జగన్‌కు అంటగట్టే ప్రయత్నం
హైదరాబాద్‌: సిట్‌ విచారణ అంటే టీడీపీ నేతలకు సీల్డ్‌ కవర్‌ లాంటదని, ఆ కేసు క్లోజ్‌ అయినట్లే అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు. దర్యాప్తులను శాసిస్తున్నది ఎవరని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసుల క్రిడిబిలిటీని టీడీపీ నేతలు మార్చేశారని, అధికార పార్టీకి పోలీసులు తొత్తుల్లా మారిపోయారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏ ఒక్క సిట్‌ విచారణ కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకురాలేదని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ హత్యాయత్నం ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరు చూసిన తరువాత పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. శనివారం వాసిరెడ్డి పద్మ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.. వైయస్‌ జగన్‌ పాదయాత్రను ఆపేసేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంనద్నారు.  మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. రాష్ట్ర పోలీసులపై, జనంపై నమ్మకం లేని వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఎట్లా చేస్తారని మంత్రి కాల్వ పేర్కొనడం దారుణమన్నారు.  ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే చంద్రబాబు జెడ్‌ ప్లస్‌ రక్షణలో ఉన్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేకనే జెడ్‌ ప్లస్‌ భద్రత పెట్టుకున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిటాల రవి హత్యపై సీబీఐ విచారణ కోరింది నిజం కాదా అన్నారు. ఈ ప్రభుత్వం వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై నీరుగార్చే విధంగా వ్యవహరించడంతోనే ఒక స్వతంత్ర ప్రాతిపాదిక కలిగిన సంస్థతో విచారణ చేయించాలని మేం డిమాండు చేస్తున్నామన్నారు. నాలుగేళ్లలో ఆరు సంఘటనలపై సిట్‌ దర్యాప్తుకు ఆదేశించారన్నారు. సిట్‌ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో టీyî పీ నాయకులు ఆ కేసుల్లో బయటపడ్డారన్నారు. విశాఖ భూ కుంభకోణంలో సిట్‌ విచారణ పూర్తి కాకముందే మంత్రి గంటా శ్రీనివాసులు నిర్దోషిగా బయటపడినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారన్నారు. సిట్‌ నివేదిక బయటకు రాకుండానే ఎప్పుడో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేసిన ధర్మాన ప్రసాదరావు పేరు ఉందని లీకులు ఇచ్చి వార్తలు రాయించారన్నారు. శేషాచలం అడువుల్లో పోలీసు కాల్పుల్లో 20 మంది ఎ్రరచందనం కూలీలు మరణిస్తే..సిట్‌ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. ఇందులో దోషులు ఎవరని నిలదీశారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు కేసులో అవినీతి సొమ్ము ఇస్తూ పట్టుబడి ఆడియో,వీడియో టేపులతో సహా దొరికిపోయారన్నారు. ఆ కేసులో ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని సిట్‌ వేశారని, దాని వల్ల ఏం తేలిందన్నారు. విజయవాడలోని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా భూ కబ్జాలు చేస్తే ఆ కేసులో వేసిన సిట్‌ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో టీడీపీ నేతలు ఉన్నారని పేర్కొంటే..ఆ కేసులో సిట్‌ దర్యాప్తు వేసి నిజాలను నీరుగార్చారన్నారు. సిట్‌ అంటేనే నేరస్థులు ఊపిరి పీల్చుకున్నట్లుగా తయారైందన్నారు. సిట్‌పై నమ్మకం పెట్టుకోవడం ప్రజలు మొదటి సంవత్సరంలోనే మానేశారని తెలిపారు. lచంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేసి రూల్స్‌ ప్రకారం వెళ్లకండి..అధికారంలో ఉన్న మాకు అండగా ఉండాలని ఆదేశించారన్నారు. ఈ నాలుగేళ్లలో జరిగిన దర్యాప్తుల్లో పోలీసులు పోలీసుల మాదిరిగా వ్యవహరించిన సందర్భం లేదని గుర్తు చేశారు. అధికార పార్టీకి తొత్తుల్లా పని చేశారని ఆరోపించారు. అసలు నిందితులు ఎవరు, మూలాలను పరిశీలించారా అని నిలదీశారు. దర్యాప్తుకు ఆదేశించారంటే అసలు విషయాన్ని బుట్టదాఖలు చేయడమే, ఆ కేసు క్లోజ్‌ అయినట్లే అన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే..ఆ కుట్ర వెనుక అసలు దోషులు ఎవరు ఉన్నారని ప్రయత్నించకుండా నీరుగార్చే విధంగా ప్రవర్తిస్తే సిట్‌పై ఎలా నమ్మకం కలుగుతుందన్నారు. కోడికత్తి అంటూ అవహేళన చేస్తున్న టీడీపీ నాయకులపై ఎలా నమ్మకం కలుగుతుందన్నారు. ఏపీ పోలీసులకు రంగు, రుచి మార్చేశారని విమర్శించారు. తునిలో రైతు దహనం సంఘటన జరిగితే దాన్ని కప్పి పుచ్చడానికి వైయస్‌ జగన్‌కు ఆ కేసు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. రాజధానిలో రైతుల పంటలను తగులబెట్టి ఆ కేసును కూడా ప్రతిపక్ష నేతకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉందని కొందరు అధికారులు తేల్చితే వారిని సస్పెండ్‌ చేశారని తెలిపారు. దర్యాప్తు అన్నది ఏ విషయంలోనైనా సరే నిష్పక్షపాతంగా జరిపామన్నది  ఒక్క సంఘటన చూపించాలని వాసిరెడ్డి పద్మ సవాలు విసిరారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వైయస్‌ జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమలో మట్టి పోసి చంద్రబాబు బినామీలు కోట్లు కొల్లగొడితే దానికి సంబంధించిన కాల్వకు గండి పడితే దానికి వైయస్‌ జగన్‌ కారణం అని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. దర్యాప్తును శాసిస్తున్నది ఎవరని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రతి దర్యాప్తులో వైయస్‌ జగన్‌ను వేలెత్తి చూపించాలని చంద్రబాబు పోలీసులకు ట్రైనింగ్‌ ఇస్తున్నారని విమర్శించారు.






 
Back to Top