పులివెందులలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం 

వైయ‌స్ఆర్ జిల్లా :  చంద్రబాబు రెండేళ్ల పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ వైయ‌స్ఆర్ జిల్లాలోని పులివెందులలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం నిర్వహించారు. భాకరాపురంలోని వైయ‌స్ఆర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసినట్లు ఆరోపిస్తున్న హామీల ఉల్లంఘనలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, వివిధ వర్గాలకు జరిగిన అన్యాయాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైయ‌స్ఆర్ సీపీ నేతలు వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ మధు రెడ్డి, చవ్వా దుశ్యంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

Back to Top