బాబును పిచ్చాసుపత్రికి తరలించాలి

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయనను వెంటనే పిచ్చాస్పత్రికి తరలించాలని గోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీకి ఓట్లు వేయకుంటే రేషన్‌ కట్‌ చేస్తామంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. సీఎం పదవిలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని వెన్నపూస గోపాల్‌ రెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక ఓటమి భయంతోనే ఆయన అభద్రతాభావానికి గురవుతున్నారన్నారు. తనకు ఓటేయకపోతే పెన్షన్లు ఇవ్వనని చంద్రబాబు ఎలా అంటారని నిలదీశారు. చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నారని అన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రమాదకరమని...ఇప్పటికైనా చంద్రబాబు బెదిరింపు ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు. పెన్షన్లు, రోడ్ల కోసం ఖర్చు పెట్టేది సీఎం చంద్రబాబు సొంత డబ్బు కాదని...అది ప్రజల డబ్బని తెలుసుకోవాలని చురకలంటించారు.

తాజా ఫోటోలు

Back to Top