ప్లీనరీకి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు

  • అధికార పార్టీ తప్పులను బయటపెడతాం..
  • లోకేష్‌ విశాఖకు పదే పదే వచ్చేది ఇందుకేనా...
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేస్తూ, అధికార తెలుగుదేశం పార్టీ అవినీతి, అక్రమాలను ప్రజల ముందు పెట్టేందుకే ప్లీనరీ సమావేశం నిర్వహించుకుంటున్నామని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి స్పష్టం చేశారు. నేడు విజయనగరం జిల్లా వ్యాప్త వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశం జగన్నాథ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి కొలగట్ల ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ.. 9 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. గత సమావేశాల కంటే ఈ ప్లీనరీకి ప్రజల్లో స్పందన పెరిగిందన్నారు. స్వచ్ఛందంగా మాతో భాగ్వసాములు అవుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.

టీడీపీ కీలక నేతలు కూడా ఉన్నారు...
విశాఖ భూ కుంభకోణాలపై డీజీపీ ప్రకటించిన జాబిత కంటితుడుపుగా ఉందన్నారు. 25 మంది వ్యక్తులే కాదు. టీడీపీ కీలక నేతలు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు కాబట్టే లక్షల ఎకరాల కుంభకోణం జరిగిందన్నారు. లోకేష్‌ విశాఖపట్నానికి పదే పదే వస్తుంటే... కొత్తగా మంత్రి పదవి చేపట్టాడు కదా.. అందుకే వస్తున్నాడనుకున్నాం.. కానీ భూదందాలకు నాయకత్వం వహించడానికి వచ్చాడని ఇప్పుడే అర్థం అవుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీగా చెబుతుంది కాదని, లోకమంతా కోడై కూస్తుందన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు పట్టవని ఏ విధంగానైనా 2019 ఎన్నికల్లో గెలిచేందుకు రూ. 5 వేలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. 9 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. బూత్‌ లెవల్‌ కమిటీలు కూడా వేశామని చెప్పారు. నియోజకవర్గాల్లోని ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్లీనరీలో చర్చించేందుకు తీర్మాణాలు కూడా చేశామన్నారు. 
Back to Top