ప్రత్యేక హోదానే మా ఊపిరి

రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే వైయస్‌ఆర్‌ సీపీ ధ్యేయం
హోదా వద్దన్న వ్యక్తితో.. హోదా నినాదం పలికించిన వ్యక్తి వైయస్‌ జగన్‌
మాట తప్పకుండా ఎంపీలతో రాజీనామాలు
చంద్రబాబు ప్రజలను గొర్రెలుగా భావిస్తున్నారు
వైయస్‌ జగన్‌ సవాల్‌కు సమాధానం చెప్పాలి
ఢిల్లీ: ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా సాధనే మా ఊపిరి అనే నినాదంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి పోరాడుతున్నారని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి అన్నారు. హోదా కోసం గుంటూరు వైయస్‌ జగన్‌ ఆమరణ దీక్ష, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు యువభేరీలు సైతం నిర్వహించారన్నారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వద్ద వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు చేపట్టబోయే ఆమరణ దీక్ష ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హోదా విషయంలో చంద్రబాబు అనేకసార్లు రంగులు మార్చారని ధ్వజమెత్తారు. హోదా సంజీవని కాదు.. హోదా అంటే జైల్లో పెడతామని బెదిరింపులకు గురిచేసిన చంద్రబాబు చేత హోదా నినాదం పలికించిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అన్నారు. మాట తప్పడం.. మడమ తిప్పడం వైయస్‌ఆర్‌ వంశంలోనే లేదని, ఇచ్చిన మాట ప్రకారం హోదా కోసం లోక్‌సభ ఎంపీలతో రాజీనామాలు చేయించారన్నారు. 

ప్రజలు ఏది చెబితే అది నమ్ముతారని, రాష్ట్ర ప్రజానికాన్ని చంద్రబాబు గొ్రరెల్లా భావిస్తున్నారని పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. 30 సార్లు ఢిల్లీ వచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఢిల్లీలో ఉద్దరించింది ఏదీ లేదన్నారు. ఎంత సేపటికీ ప్రతిపక్షంపై బుదరజల్లే ప్రయత్నం తప్ప హోదా కోసం ఎప్పుడూ చిత్తశుద్ధితో పోరాడలేదన్నారు. నాలుగేళ్లలో హోదా కోసం పోరాడినట్లు ఒక్క ఫొటో, ఒక వీడియో క్లిప్పింగ్‌ అయినా ఉందా అని ప్రశ్నించారు. నియోజకవర్గల పెంపు, వైయస్‌ జగన్‌పై కేసులు పెట్టండి అని కేంద్రాన్ని కోరడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఆలోచించని వ్యక్తి సీఎం ఉండటానికి అనర్హుడన్నారు. 16 మందితో ఎందుకు రాజీనామాలు చేయించలేదని వైయస్‌ జగన్‌ విసిరిన సవాల్‌కు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. 
 
Back to Top