వైయ‌స్ఆర్ కుటుంబం

హైద‌రాబాద్‌:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.   అందరూ ఒక జట్టుగా ఏర్పడి అరాచక పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడమే ‘వైయ‌స్ఆర్‌ కుటుంబం’ ఏర్పాటు ప్రధానోద్దేశం. ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 11న ప్రారంభమై అక్టోబర్‌ 2వ తేదీ వరకూ కొనసాగుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 8వ వర్ధంతి రోజున ‘వైయ‌స్ఆ ర్‌ కుటుంబం’ కార్యక్రమాన్ని వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 పార్టీ నేత‌లు ప్ర‌తి ఇంటికీ వ‌స్తారు:
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచ‌న‌ల మేర‌కు ప్ర‌తి ఒక్క  కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌ కుటుంబ సభ్యులుగా చేర్చడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికీ వ‌స్తారు. ఒక గ్రామంలో 10 మంది బూత్‌ కమిటీ సభ్యులుంటే ఒక్కొక్కరు రోజుకు రెండు కుటుంబాలను క‌లుస్తారు. ప్రతి ఇంట్లో ఆ సభ్యుడు కనీసం 20 నిమిషాల పాటు కూర్చొని సీఎం చంద్రబాబు  పాలనపై రూపొందించిన 100 ప్రశ్నలకు వారితోనే మార్కులు వేయిస్తారు. అలాగే దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయన స్వర్ణయుగం గురించి కూడా వివరిస్తారు. ఆ తర్వాత వైయ‌స్ఆర్‌ కుటుంబంలో చేరడానికి 9121091210 మొబైల్‌ నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇప్పిస్తారు. వెంటనే అదే నంబర్‌ నుంచి పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నుంచి వాయిస్‌ కాల్‌ వస్తుంది. 
Back to Top