వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్సీపీ నేతల పర్యటన

వైఎస్సార్
జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ
నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్ రెడ్డి
రైల్వే కోడూరులో వరద బాధితులను పరామర్శించారు. గత రెండు రోజులుగా
కురుస్తున్న భారీ వర్షాలతో  రైల్వేకోడూరులో వేల ఎకరాల్లో పంటలు
ధ్వంసమయ్యాయి. ధర్మాపురం, గాండ్లవీధిలో వరద బాధితులను నాయకులు
పరామర్శించారు. 

వరంగల్ లోక్ సభ ఉపఎన్నికల
ప్రచారంలో ఉన్న వైఎస్ జగన్...ఎప్పటికప్పుడు వరద పరిస్థితులపై జిల్లా నేతలతో
ఫోన్ లో మాట్లాడుతున్నారు. బాధితులను ఆదుకోవాలని నాయకులు, కార్యకర్తలకు
సూచించారు. మరో రెండ్రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో
అప్రమత్తంగా ఉండాలన్నారు.  
Back to Top