విజయనగరం: సి.రామచంద్రయ్య వైయస్‌ఆర్‌సీపీలో చేరడం శుభ పరిణామమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన చేరికతో పార్టీలో బలం పెరిగిందన్నారు. రామచంద్రయ్యకు రాజకీయనాయకుడికి ఉన్న లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌సీపీలోకి రావాలని మేం కోరడంతో రామచంద్రయ్య మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆయన రాకతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారన్నారు. ఇలాంటి వారంతా వైయస్‌ఆర్‌సీపీలోకి రావడంతో వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కాయమైందన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. టెంపరరీ రాజధాని తప్ప పర్మినెంట్ పేరుతో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. ఇంతదారుణంగా అవినీతి పాలనను ఎప్పుడు చూడలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడిపై హత్యాయత్నం జరిగితే ఒకరిని కూడా విచారించకుండా చంద్రబాబు, డీజీపీ వ్యవహరించిన తీరు చూస్తే బాధనిపిస్తుందన్నారు. మాకు తోడుగా పార్టీలో చేరుతున్న పెద్దలతో పార్టీ బలోపేతమైందన్నారు.