టీడీపీ పాలనంతా దోపిడీమయం..

విజయవాడః చంద్రబాబు పాలన అంతా దోపిడీమయం అని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ప్రధాన పత్రికల్లో కథనం వచ్చిందన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ మహానాడులోనే ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి చెప్పారన్నారు.టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు ఇస్తారా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో లంచం లేనిదే ఏ పని జరగడం లేదన్నారు.లంచాలు కట్టలేక సామాన్యులు బలి అవుతున్నారన్నారు.రాష్ట్రం అంతా టీడీపీ మాఫియా దోచుకుంటుందన్నారు.డ్వాక్రా అక్కచెల్లెమ్మలను నిలువునా ముంచి వారి ఇళ్లకు ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.జ్ఞానభేరిలో చంద్రబాబు వ్యాఖ్యలు దారుణమన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top