<strong>ఇష్టారాజ్యంగా టీడీపీ నేతల అవినీతి</strong><strong>వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్</strong>విజయనగరంః నెల్లిమర్ల నియోజకవర్గం సమస్యల్లో చిక్కుకుని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీసీ నేత మజ్జి శ్రీనివాస్ అన్నారు. గతంలో నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దుచేస్తామని టీడీపీ హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందడంలేదన్నారు. ఈ నియోజవర్గానికి 25వేల ఎకరాలకు సాగునీరు అందించాలని దివంగత మహానేత వైయస్‌ఆర్ తారక రామతీర్థ సాగునీరు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు.సుమారు 30 నుంచి40 కోట్లు ఖర్చుపెట్టారని, ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్లు కావొస్తున్న ఎక్కడివేసినా గొంగళి అక్కడే ఉందన్నారు. జ్యూట్ మిల్లులు, తోటపల్లి ప్రాజెక్టులకు కాల్వలు లేకపోకపోవడం వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయన్నారు. బోగాపురం ఎయిర్‌పోర్ట్ కోసం 15వేల ఎకరాలను బలవంతంగా లాక్కొని, తమ మంత్రుల భూములను వదిలేశారని, వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన ఫలితంగా 15 ఎకరాలనుంచి 2వేల ఎకరాలకు ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఇసుక దందా సాగుతుందని, నీరు–చెట్టులో విచ్చలవిడి అవినీతి జరుగుతుందన్నారు.