గుండె పోటుతో వైయ‌స్ఆర్ సీపీ నేత మృతి

వెల్లలచెరువు(సంతమాగులూరు): మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు యర్రంరెడ్డి కోటేశ్వరరెడ్డి(70) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ప్ర‌కాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన చెంచు గరటయ్య ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. ఫోన్ చేసి కోటేశ్వ‌ర‌రెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డిని ప‌రామ‌ర్శించి సానుభూతి తెలిపారు. మండల నాయకులు అట్లా చిన్నవెంకటరెడ్డి, పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించారు.

Back to Top