ధర్మపోరాటాల పేరుతో వంచ‌న‌


గుంటూరు:  నాలుగేళ్లు కేంద్రంతో క‌లిసి కాపురం చేసిన చంద్ర‌బాబు ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు బ‌య‌ట‌కు వ‌చ్చి ధ‌ర్మ పోరాటల పేరుతో ప్రజలను వంచిస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పటివరకు పోరాటం చేయలేదని తెలిపారు. నాలుగేళ్లుగా హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తోంద‌ని, చివ‌ర‌కు పార్టీ ఎంపీలు త‌మ ప‌ద‌వులను త్యాగం చేశార‌న్నారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు.  
Back to Top