నీచం అనే పదానికి కేరాఫ్‌ చంద్రబాబు

వైయస్‌ జగన్‌ను విమర్శించేందుకు ప్రజాధనంతో పబ్లిక్‌ మీటింగ్‌లు
గతంలో వైయస్‌ఆర్‌.. ఇప్పుడు వైయస్‌ జగన్‌ అంటే బాబు వెన్నులో వణుకు
కడపను కడుపులో దాచుకున్న మహానుభావుడు వైయస్‌ఆర్‌
కడప కడుపు కొడుతున్న నీచుడు చంద్రబాబు
హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగాకు బాబు కేటాయించిన నిధులెంత?
వైయస్‌ఆర్‌ పూర్తి చేసిన ప్రాజెక్టులకు చంద్రబాబు లష్కర్‌ ఉద్యోగి
ఊసరవెల్లి కంటే ఎక్కవ రంగులు మార్చిన రాజకీయ పురుగు చంద్రబాబు
600ల వాగ్ధానాల్లో ఒక్కటైనా నెరవేర్చావా..?
పులివెందుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా చంద్రబాబూ?
బాబు రాక్షసపాలన గుండెల్లో గునం గుచ్చే నాయకుడు వైయస్‌ జగన్‌

తిరుపతి: రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తాను నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని చెప్పకుండా.. కేవలం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడానికే ప్రజాధనంతో పబ్లిక్‌ మీటింగ్‌లు పెడుతున్నాడని విమర్శించారు. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డిని చూస్తే వణికిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయసున్న ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చేస్తే అంతకంటే ఎక్కవగా చంద్రబాబు వెన్నులో దడపుడుతుందన్నారు. కడపను కడుపులో దాచుకున్న మహానుభావుడు వైయస్‌ఆర్‌ అయితే.. కడప కడుపు కొడుతున్న నీచుడు చంద్రబాబు అని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే.. 

– అనంతలో పేరూరు గ్రామంలో చంద్రబాబు ప్రసంగిస్తూ రెండు గంటలపాటు ప్రజలను వీరబాదుడు. ఎప్పుడు మైకులు ఎత్తుకున్నా.. గంటల తరబడి ప్రజలను చిత్రవధ చేసే ప్రక్రియలో భాగంగా నిన్న అనంతలో జరిగిన బహిరంగ సభ యథాలాపం. . 
– నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు చేసిన మంచిని, 600ల వాగ్ధానాలు నెరవేరుస్తున్నానని. అవి ఇంతగా పూర్తయ్యాయని ఒక్కటి కూడా మాట్లాడకుండా.. చంద్రబాబు ప్రసంగమంతా వైయస్‌ జగన్‌పై ప్రతీకారం తీర్చుకునేలా.. శత్రువుకంటే హీనంగా మాటలతో సమయాన్ని గడిపాడు. 
– 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది అని చెప్పుకునే చంద్రబాబు గతంలో వైయస్‌ఆర్‌ను తిట్టడానికి సమయాన్ని అంతా ఉపయోగించాడు. ఇప్పుడు వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేయడానికే ప్రభుత్వ డబ్బును కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బహిరంగసభలుగా మార్చి.. పార్టీ వేదికలుగా మార్చుకొని వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణల పర్వానికి నిరంతరం తెరతీస్తున్నారు. 
– గతంలో వైయస్‌ఆర్‌ను చూస్తే వణికిపోయిన చంద్రబాబు.. తన రాజకీయ అనుభవం అంత వయసున్న ఆయన తనయుడిని చూస్తే అంతకంటే ఎక్కవ వెన్నులో దడపుడుతుందన్నారు. వైయస్‌ జగన్‌ లాంటి ప్రతిభాశీలి తన రాజకీయ జీవితానికి సమాధి కడతాడన్న భయంతో చంద్రబాబు రాజకీయ పరమైన విమర్శలు కాకుండా.. వ్యక్తిగత దూషణల బూతు పంచాంగాన్ని ఎత్తుకొని కాలం గడుపుతున్నాడు. 
– గత నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు మొదడు, నోరు అనే డ్రైనేజీ నుంచి దూసుకువచ్చే మలినం  అంతా హైదరాబాద్‌ మూసీ మురికి కంటే హీనంగా ఉంది.  
– ముఖ్యమంత్రిగా దాదాపు 50 నెలలుగా ఉన్న వ్యక్తి 50 నెలల పాటు తన ప్రభుత్వం ఏం మంచి చేసింది. ఏయే కార్యక్రమాలు చేసి ప్రజల మనసులను చురగొన్నారనే విషయాలు చెప్పకుండా వైయస్‌ జగన్‌ తోకముడిచారు. భయపడే జగన్‌. ఇలా అనేక రకాల మాటలు చంద్రబాబు మాట్లాడాడు. 
– వైయస్‌ఆర్‌ తన ఐదేళ్ల పాలనలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశాడని, హంద్రీనీవాను నేనే పూర్తి చేస్తున్నానని చంద్రబాబు మాట్లాడాడు. గతంలో తొమ్మిది సంవత్సరాల పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిని ఎలబెడుతున్న చంద్రబాబు .. హంద్రీనీవా, తెలుగుగంగా, గాలేరు నగరిని ఎందుకు పూర్తి చేయలేకపోయావు. 
– వైయస్‌ఆర్‌ వచ్చిన తరువాతే తెలుగుగంగా పూర్తయింది. గాలేరు నగరికి, హంద్రీనీవా ప్రాజెక్టుకు వైయస్‌ఆర్‌ వెచ్చించిన నిధులెంత.. నాలుగున్నర సంవత్సరాల్లో, అంతకు పూర్వ తొమ్మిదేళ్లలో నువ్వు వెచ్చించిన నిధులు ఎంత.. చంద్రబాబూ?
– గాలేరునగరి, హంద్రీనీవాకు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేశావు. 
– వైయస్‌ఆర్‌ తన పాలనలో ప్రాజెక్టును 90 శాతానికి పైగా పూర్తి చేస్తే నీవు గేట్లు ఎత్తే లష్కర్‌ ఉద్యోగిలా.. వైయస్‌ఆర్‌ పూర్తి చేసిన ప్రాజెక్టును గేట్లు ఎత్తి నేనే పూర్తి చేశానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ఇల్లు కట్టినోడు కాకుండా సున్నం కొట్టినోడు ఇల్లు నేనే కట్టానని చెప్పుకున్నట్లు చంద్రబాబు వైఖరి ఉంది. 
– ప్రచారంలో చంద్రబాబుకు ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా తక్కువే.. నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉండి ప్రత్యేక హోదా గురించి ఒక్క రోజైనా మాట్లాడావా.. ? 
– వైయస్‌ఆర్‌ సీపీ మాట తప్పిందని మాట్లాడుతున్నాడు. నాలుగున్నరేళ్ల కాలంలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ వీరుడిలా పోరాటం చేశారు. వైయస్‌ జగన్‌ లాంటి వ్యక్తి ప్రతిపక్షనేతగా ఉండిఉండకుంటే.. చంద్రబాబు ప్రత్యేక హోదాను సమాధి కట్టేవాడు.. 
– వైయస్‌ జగన్‌ చేసిన వీరోచిత పోరాటాల కారణంగానే చంద్రబాబు జడిసి యూటర్న్‌ తీసుకున్నాడు. 
– హోదా కావాలని ఢిల్లీ నగర వీధుల్లో వేలాది మందితో ధర్నా చేసి పార్లమెంట్‌ను ముట్టడికి యత్నిస్తూ వైయస్‌ జగన్‌ అరెస్టు అయ్యారు. 
– చంద్రబాబు ఆత్మపుత్రికలైన పచ్చ పత్రికలతో నిరంతరం వైయస్‌ జగన్‌పై దాడి చేయిస్తూ వీరోచిత పోరాటాలను విలువ లేనివిగా చిత్రీకరిస్తూ.. రోజుకు ఒక మాట ఎత్తుగడ చేస్తూ.. ఊసరవెల్లికంటే ఎక్కవ రంగులు మార్చిన రాజకీయ పురుగు చంద్రబాబు. 
– వైయస్‌ జగన్‌ పులివెందులకు నీరు రానివ్వకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారు.  రాయలసీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమ వీరోచిత చరిత్రను మర్చిపోయి.. ఎక్కడ పడితే అక్కడ హీనంగా మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసే ద్రోహం రాజకీయ స్వార్థం, ప్రయోజనాల కోసమని ఎంత నైత్యానికైనా పాటుపడే వ్యక్తి చంద్రబాబు. 
– పోరాటాలే ధ్యేయంగా ప్రజల హృదయాల్లో నిలిచిన వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నాడు. 
– కాపుల ఉద్యమాన్ని అణిచి తునిలో జరిగిన సభలో రైలు దగ్ధానికి కారణమైన చంద్రబాబు.. చంద్రబాబు ఆదేశంతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను టీడీపీ నేతలు తగలబెట్టారనేది వాస్తవం. అది ముద్రగడపై తోశారు. పోరాటాన్ని సమర్థించినందుకు తనపై కూడా కేసులు బనాయించారు. 
– కాపు రిజర్వేషన్‌ కేంద్రంపైకి నెట్టి చేతులు దులుపుకుంది ఎవరు.. కాపు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ.. ఆ పోరాటానికి సంఘీభావం తెలిపింది వైయస్‌ఆర్‌ సీపీ.  
– ప్రతి ఒక్క కులాన్ని, వర్గాన్ని మోసం చేసింది చంద్రబాబు. దగపడ్డా హృదయం పోరాడుతుంటే.. వైయస్‌ఆర్‌ సీపీ అండగా నిలుస్తుంది. వైయస్‌ఆర్‌ సీపీ ముద్రగడ పోరాటానికి మద్దతు ఇచ్చింది.  
– కాపు రిజర్వేషన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకం కాదని, వైయస్‌ జగన్‌ చెప్పిన మాటలను వక్రీకరించి పచ్చమీడియాలో కథనాలు రాయించారు. 
– ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారో.. 30 ఏళ్ల క్రితం కాపుల ఆత్మగౌరవ నినాదంతో ఉద్యమాలు చేసిన వంగవీటి మోహనరంగాను నట్టనడి వీధిలో హత్య చేసిన సంస్కృతి చంద్రబాబుదని అప్పటి హోంమంత్రి హరిరామజోగయ్య ఆత్మకథను పరిశీలించాలని కాపు సోదరులకు విజ్ఞప్తి. 
– అడుగడుగునా కాపులను తన చెప్పుకింద తేళ్లలా వాడుకునే చరిత్ర చంద్రబాబుది. కాపులకు న్యాయం చేయాలా అనే ఏ ఆలోచన లేకుండా.. ఓటర్లుగా చూసిన వ్యక్తి చంద్రబాబు అయితే.. కాపులను మానవీయ హృదయాలుగా వారి జీవితాలకు వెలుగు తీసుకురావాలని రూ. 10 వేల కోట్లు ప్రకటించిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అనే విషయాన్ని నొక్కి చెబుతున్నాం. 
– చంద్రబాబు వైయస్‌ఆర్‌ పాలనలో జరిగిన అభివృద్ధి.. నాలుగున్నర సంవత్సరాల్లో మీరు ఏమేమి నీటి పారుదల విషయంలో కానీ.. ప్రజల అభివృద్ధిలో కానీ చర్చకు సిద్ధమా..?
– హంద్రీనీవాకు వైయస్‌ఆర్‌ ఎంత ఖర్చు చేశారు.. మీరెంత ఖర్చు చేశారో ఛాలెంజ్‌ చేసి అడుగుతున్నాం. ఊరికే మాటలు చెప్పడం కాదు.. ప్రభుత్వధనంతో మీటింగ్‌లు పెట్టి వైయస్‌ జగన్‌ను తిట్టడమే లక్ష్యంగా చంద్రబాబు కార్యక్రమాలు చేస్తున్నాడు. 
– చంద్రబాబుకు ప్రజలకు మేలు చేశానని ఆలోచన ఉంటే.. 600లకు పైగా హామీలిచ్చిన నువ్వు ఒక్కటైనా పరిపూర్ణంగా అమలు చేశావా..? రైతులకు రుణమాఫీ రూ. 87 వేల కోట్లు రద్దు చేశావా..? డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేశావా..? ఇంటికో ఉద్యోగం ఇచ్చావా? రజకులను ఎస్టీల్లో చేర్చావా..? మహిళలకు సెల్‌ఫోన్లు ఇచ్చావా..? 25 లక్షల ఇల్లు కట్టిస్తానన్నావు.. వైయస్‌ఆర్‌ హయాంలో పూర్తికాకుండా మిగిలిన ఇళ్లకు సున్నం కొట్టి పండగ చేసుకున్నారు. దానికి కూడా కొన్ని కోట్లు ఖర్చు చేసి ప్రారంభోత్సవాలు చేశారు. నీవా వైయస్‌ఆర్‌ గురించి మాట్లాడేది.
– కేసుల భయం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదా..? ఇప్పటికీ సోనియాగాంధీతో చేతులు కలిపి చంద్రబాబు పెట్టిన అక్రమ కేసుల విచారణ ఎదుర్కొంటున్న దమ్మున్న నాయకుడు వైయస్‌ జగన్‌.
– ఓటుకు కోట్ల కేసులో ప్రపంచంలోనే ఏ దొంగ దొరకనంతగా.. అడ్డంగా దొరికిపోయి మోడీ కాళ్ల దగ్గర సాగిళ్లపడి.. కేసీఆర్‌కు వెయ్యికోట్లు ముడుపులు చెల్లించుకొని నాలుగున్నర సంవత్సరాలు మోడీ చెప్పిందానికి తలాడించిన వ్యక్తి చంద్రబాబు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాయకుడు వైయస్‌ జగన్‌. 
– కడపను కడుపులో దాచుకుంది వైయస్‌ఆర్‌ అయితే.. కడప కడుపు కొట్టిన నీచుడు చంద్రబాబు. ఆరోపణలు మాట్లాడితే వాస్తవాలు మరుగునపడవు. 
– కుప్పానికే ఏమీ చేయలేని నువ్వు గొప్పలు మాత్రం కుప్పులు తెప్పలుగా మాట్లాడే నువ్వు.. పులివెందల అభివృద్ధి గురించి చర్చించుకుందామా..? 
– పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్‌ను విస్తీర్ణం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రకాశం బ్యారేజీ మీద దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభుత్వంలో నీటిపారుదల శాఖామంత్రి. 
– పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే ఒక్కరోజు కూడా వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా.. నిమ్మకునీరెత్తినట్లు చంద్రబాబు ఉన్నారు. 
– తెలంగాణ ప్రాజెక్టులు కడుతుంటే.. ఓటుకు కోట్లకు కేసుకు భయపడి కేసీఆర్‌ కాళ్లకు మొక్కి రాష్ట్ర ప్రయోజనాలను మరిచిన చంద్రబాబు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడడం. 
– రాజకీయాల్లో నీచం అనే పదానికి చంద్రబాబు కేరాఫ్‌ అడ్రస్‌. 
– చంద్రబాబు పాలన మారీచుడికి ఎక్కువ.. రావణాసురిడికి ఎక్కవ. 
– రాక్షస సంతతికి చెందిన వాడు కాబట్టే ప్రజకంఠక పాలన చేస్తూ ఆ ప్రజాకంఠక పాలనను రామరాజ్యం కంటే గొప్పదిగా ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నాడు. 
– చంద్రబాబుకు మళ్లీ అధికారం కల. చంద్రబాబు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలకు అంతిమకాలం సమీపించింది. రాక్షసపాలన గుండెల్లో గునపాన్ని గుచ్చే వీరుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 
– వైయస్‌ జగన్‌ ఐదుకోట్ల ఆంధ్రప్రజల ఆశాజ్యోతిగా.. ప్రజాఆశీర్వాదంతో వారి మనుసులు గెలుచుకొని పరిపాలనను తుదముట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 
– ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి బుద్ధి ఎరిగి.. చేసిన తప్పులకు లెంపలు వేసుకొని ప్రజాద్రోహిగా మిగలకుండా పాలన సాగించాలని హెచ్చరిస్తున్నాం. 
 
Back to Top