చంద్రబాబు రాక్షస పాలనపై సమరశంఖారావం

వినుకొండ : చంద్రబాబు రాక్షస పాలనపై సమరశంఖం పూరించాల్సిన సమయం ఆసన్నమైందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఐదు మండలాల నాయకులు పెద్ద ఎత్తున శుక్రవారం తరలివెళ్లారు. ప్లీనరికీ వెళ్తున్న వాహన శ్రేణిని మూలె వెంకటేశ్వరరెడ్డి జెండా ఊపీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అన్నింటికి అధికార మాఫియాలు ఉన్నాయని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ ఊరుకోదని, వారి పక్షాన పోరబాట తప్పదని హెచ్చరించారు. ఖరీఫ్‌ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలను అందజేయలేని ప్రభుత్వం నకిలీ విత్తనాల అమ్మకాలను మాత్రం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. జిల్లా ప్లీనరీలో స్థానిక సమస్యలను ప్రస్థావించనున్నట్లు చెప్పారు.
పాస్‌లు లేకపోయినా ఉత్సాహంగా ..
గుంటూరులో నిర్వహించే జిల్లా ప్లీనరీకి నియోజకవర్గానికి కేవలం 200 పాస్‌లు మాత్రమే అందాయి. అవి నాయకులకే సరిపోవటంతో కార్యకర్తలకు, యువతకు పాస్‌లు అందలేదు. యువత పాస్‌లు లేకపోయినా ప్లీనరీకి హాజరవుతామని వాహనాల్లో గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి గుంటూరుకు తరలివెళ్లారు.
Back to Top