హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ


వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా

కాకినాడ: ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై ప్రతిపక్ష నాయకుడిని అదుపులోకి తీసుకున్న దాఖలాలు లేవని, హోదా పోరుకు వెళ్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌కు ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు.  ప్యాకేజీని విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నానని అసెంబ్లీలో చెప్పారని, కానీ వైయస్‌ జగన్‌కు ఎక్కడ ప్రజాదరణ పెరుగుతుందోనని చంద్రబాబు సిగ్గులేకుండా యూటర్న్‌ తీసుకున్నాడన్నారు. నోట్ల రద్దు చేయమని మోడీకి చెప్పింది నేనే అని మాట్లాడుతూనే.. పక్క రాష్ట్రం వెళ్లి నోట్ల రద్దు దారుణమైన చర్య అని మాట్లాడుతున్నాడు. అతని దృష్టిలో ప్రజలు అమాయకులు, మీడియాను మేనేజ్‌ చేసి ప్రజలను మభ్యపెడితే చాలనే  దురుద్దేశంతో చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు. రాజధాని నిర్మాణం కూడా చంద్రబాబు గ్రాఫిక్స్‌లో కట్టి మీడియా ద్వారా చూపిస్తున్నాడన్నారు. అనుభవం పేరుతో కొంగ జపం చేస్తే ప్రజలు నమ్మి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారని,  అదే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ప్రత్యేక హోదాను నిలబెట్టుకోవాలని కోరారు. 
Back to Top