ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. . రాజ్యసభలో ఆయన ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌సీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రమాణం చేసిన పలువురు సభ్యులు గురువారం రాజ్యసభలో ప్రమాణం స్వీకరించారు. అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.


Back to Top