జైళ్ళ ఐజీని కలిసిన పార్టీ నేతలు

హైదరాబాద్ 26 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆరోగ్యంపై హెల్తు  బులెటిన్ విడుదల చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. సోమవారం మధ్యాహ్నం వారు  జైళ్ళ శాఖ ఐజీ సునీల్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు.  సోమవారం మధ్యాహ్నం వారు ఆయనతో భేటీ అయ్యారు. ఈ భేటిలో శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు పాల్గొన్నారు.
 
చంచల్ గూడ జైల్లో దీక్ష చేస్తున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య స్థితిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని, అందుకే బులెటిన్ విడుదల చేయాలని జైళ్ల శాఖ ఐజీని కోరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నిరంకుశ ధోరణికి నిరసనగా శ్రీ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షకు ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని కోరామని పార్టీ నేతలు విలేకరులకు చెప్పారు. ప్రతి రోజు ఒకసారి హెల్తు బులెటిన్ విడుదలకు జైళ్లశాఖ ఐజీ అంగీకరించారని నేతలు తెలిపారు. ప్రస్తుతం శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉందని నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top