వరద బాధితులకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విరాళం

హైదరాబాద్ :

ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన వరద బాధితులకు సహాయం చేసేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు రూ. 21.23 లక్షల విరాళాన్ని అందజేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పిలుపు మేరకు వారంతా తమ తమ విరాళాలను మంగళవారంనాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందజేశారు. కాగా వరద బాధితుల సహాయార్థం శ్రీమతి విజయమ్మ స్వయంగా లక్ష రూపాయలు అందజేశారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ ఎమ్మెల్సీలు దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు, సి. నారాయణరెడ్డిలు తమ ఒక నెల జీతం రూ. 95 వేల చొప్పున విరాళంగా అందజేశారు.

మాజీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ నాయకులు వై. స్వర్ణలతా సుబ్బారెడ్డిలు లక్ష రూపాయల చొప్పున విరాళంగా అందజేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు జిల్లా కావలి సమన్వయకర్త ఆర్. ప్రతాప్‌కుమార్‌రెడ్డి, హైదరాబాద్‌ ఆర్.కె.పురం కార్పొరేటర్‌ దేప సురేఖ భాస్కర్‌రెడ్డిలు రూ. 50 వేలు చొప్పున అందజేశారు. కాగా ఎ.పి. మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ యూనియన్‌ (గుంటూరు) విభాగం 8 వేల రూపాయలు విరాళంగా అందజేశారు.

Back to Top