వైయస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రైతులకు అన్నదానం

గుత్తి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు తీసుకెళ్లడానికి వచ్చిన రైతులందరికీ శుక్రవారం వైయస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పెరుమాళ్ల జీవానందరెడ్డి గుంతకల్లు సమన్వయ కర్త వై. వెంకటరామిరెడ్డి సలహా, సూచనల మేరకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్‌సభ్యులు నక్కా నారాయణరెడ్డి, నారాయణస్వామి, చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మినారాయణ, పట్రా పుల్లయ్యలు మాట్లాడుతూ... వైయస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా వైయస్సార్‌సీపీ శ్రేణుల మద్దతుతోనే చేపడుతున్నామన్నారు. ఈ రోజు నుంచి జూన్‌3వ తేదీ వరకు వేరుశనగ విత్తన కాయల పంపిణీ ముగిసే వరకు అన్నదానం చేస్తామన్నారు. అంతకు ముందు అన్నదాన కార్యక్రమాన్ని తహశీల్దార్‌సరస్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు వెయ్యి మంది రైతులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల కన్వీనర్లు పీరా, గోవర్దన్‌రెడ్డి, బీసీ సెల్‌రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లయ్యయాదవ్, మైనార్టీ సెల్‌రాష్ట్ర కార్యదర్శి మర్తాడు అన్సార్, మండల బీసీ సెల్‌నాయకులు ఓబుళయ్య,ధర్మాపురం శీనా, రమణ, బసినేపల్లి అసేని, మహిళా నాయకురాలు నిర్మల, బ్రాహ్మణపల్లి లక్ష్మిరెడ్డి, సంజీవరెడ్డి, కౌన్సిలర్‌నజీర్, బీసీ సెల్‌జిల్లా నాయకులు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top