సుప్రీంకోర్టులో  వల్లభనేని వంశీకి ఊరట 

న్యూఢిల్లీ:  వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీకి సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను హైకోర్టుకు తిప్పి పంపిన సుప్రీమ్. అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని ఆదేశించిన సుప్రీం. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ చేప‌ట్టారు. హైకోర్టు తమ వాదన వినకుండానే ముందస్తు బెయిల్ ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. దాంతో కేసును ఏపీ హైకోర్టు మరోసారి విచారణ జరపాలని సుప్రీం కోర్టు  ఆదేశించింది. అరెస్టు నుంచి వంశీకి రక్షణను  పొడిగించాల‌ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Back to Top