మహానేతకు కుటుంబ స‌భ్యుల ఘన నివాళి

 
వైయ‌స్ఆర్ జిల్లా  : దివంగత మహానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌  ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్‌ సతీమణి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్‌  విజయమ్మ, కోడలు వైయ‌స్ భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఇతర కుటుంబ సభ్యులతోపాటు వైఎయ‌స్ఆర్‌సీపీ నేతలు వైయ‌స్ఆర్‌ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులు అర్పించినవారిలో మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వైయ‌స్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయ‌స్ఆర్‌కు నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఈ సందర్భంగా మహానేత సేవలను, ప్రజాసంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.

Back to Top