వైయస్‌ జగన్‌ పోరాట యోధుడు

–120 నియోజకవర్గాల మీదుగా  వైయస్‌ జగన్‌ పాదయాత్ర
– 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర
– పాదయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ ప్రతి ఒక్కరిని కలుస్తారు
– హోదా సంజీవని కాబట్టే వైయస్‌ జగన్‌ పోరాటం
– కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు ప్యాకేజీ కావాలంటున్నారు
 –  దమ్ముంటే ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పోరాట యోధుడని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పాదయాత్రపై బుధవారం నిర్వహించిన సమావేశం అనంతరం ఆ వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, అంబటి రాంబాబులతో కలిసి రోజా వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాదయాత్ర అన్నది దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి ల్యాండ్‌ మార్క్‌ అన్నారు. మహానేత బాటలో వైయస్‌ జగన్‌ నవంబర్‌  2న నపాదయాత్రకు స్వీకారం చుట్టారన్నారు. ఆరు నెలలు ప్రతి నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ఏ విధంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్న అంశాలపై చర్చించేందుకు ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో దాదాపు 50 మంది తమ సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు.  వాటి అన్నింటిని కూడా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నోటు చేసుకున్నార ని తెలిపారు.  

సంక్షేభంలో రాష్ట్రం
ఈ రోజు రాష్ట్రం సంక్షోభంలో ఉందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు 90 శాతం అప్పుల్లో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు దగా చేశారని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు, తన జల్సాల కోసం, తనకు కావాల్సిన వారి కోసం దోచిపెట్టేందుకు ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టుతున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ౖÐð యస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడని, పోరాటాల యోధుడని అభివర్ణించారు. అలాంటి వ్యక్తి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. పాదయాత్ర అన్నది వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఒక ల్యాండ్‌ మార్క్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ౖÐð యస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజు పాదయాత్ర చేసే సమయంలో ప్రతి మనిషిని పలకరించి, వారి కష్టాన్ని తెలుసుకున్నారు కాబట్టే దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను పక్కా రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయంటే ఆ ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. మహానేత మాదిరిగానే వైయస్‌ జగన్‌ కూడా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3 వేల కిలోమీటర్లకు పైగా జరుగుతున్నా ఈ పాదయాత్ర దాదాపు 125 నియోజకవర్గాల్లో సాగుతుందన్నారు. మిగతా 50 నియోజకవర్గాలను పాదయాత్ర అనంతరం బస్సు యాత్ర ద్వారా ఆ నియోజకవర్గాలను కూడా వైయస్‌ జగన్‌ దర్శిస్తారని రోజా వెల్లడించారు. రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతో వైయస్‌ జగన్‌ చేపడుతున్న ఈ పాదయాత్రకు ప్రతి ఒక్కరు తమ మద్దతు తెలపాలని రోజా కోరారు. 

టీడీపీ మంత్రులకు పిచ్చి పట్టింది
అనంతపురం జిల్లాలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన యువభేరి కార్యక్రమం విజయవంతం కావడంతో టీడీపీ మంత్రులకు పిచ్చి పట్టిందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని తప్పుపట్టారు. వైయస్‌ జగన్‌ను తిట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని హితవు పలికారు. రాష్ట్రంలో అధికారంలో ఉండేది టీడీపీ, ప్రజలను మోసం చేస్తుంది చంద్రబాబు అన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యం మీకుందా అని రోజా మంత్రులను సవాల్‌ చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ఈ రోజు అమ్మాయిలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు ఈ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టింది నిజం కాదా అని నిలదీశారు. ప్రత్యేక హోదా కన్న బ్రహ్మండమైన ప్యాకేజీ వచ్చిందని ఆరోజు అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పారని, ఆ ప్యాకేజీ ఎంత వచ్చిందో ఈ రోజు శ్వేత పత్రం విడుదల చేయగలరా అని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ కూడా టీడీపీ సా«ధించలేకపోయిందని, వారి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైయస్‌ జగన్‌ పై బురద చల్లుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా సంజీవని కాబట్టే వైయస్‌ జగన్‌ మూడున్నరేళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేశారని గుర్తు చేశారు. యువత చైతన్యవంతమై వైయస్‌ జగన్‌ పోరాటాలకు మద్దతిస్తున్నారు కాబట్టే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. మూడేళ్లుగా కేంద్రం నుంచి కరువు భత్యం తీసుకురావడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.  రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపిస్తూ అక్కడి రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. టీడీపీకి బుద్ధి చెప్పే విధంగా వైయస్‌ జగన్‌ పాదయాత్ర జరుగుతుందని, ప్రజలకు భరోసా కల్పించేలా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏవిధంగా సువర్ణయుగాన్ని ఇచ్చారో వైయస్‌ జగన్‌ కూడా తన తండ్రి పేరు 30 ఏళ్లు గుర్తు ఉండేలా , చక్కని పరిపాలన అందించే విధంగా ఈ పాదయాత్ర ఉంటుందని ఆమె విశ్వసించారు. పాదయాత్ర చేయకూడదని కోర్టు చెప్పందని ఆమె విలేకరులకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చేయని నేరానికి వైయస్‌ జగన్‌ శిక్ష అనుభవించారని, మేం చట్టాలను గౌరవిస్తున్నాం కాబట్టి పాదయాత్రకు అనుమతించాలని కోరుతున్నామన్నారు. కోర్టు అవకాశం ఇవ్వకపోతే ఆ ఒక్క రోజు పాదయాత్ర ఉండదని రోజు వివరించారు.
Back to Top