కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్ పేరు

కృష్ణా జిల్లా:   వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్‌టీ రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెడ‌తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఇవాళ ఎన్‌టీఆర్ స్వ‌గ్రామ‌మైన నిమ్మ‌కూరును వైయ‌స్ జ‌గ‌న్ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌టీఆర్ బంధువులు టీడీపీ పాల‌న‌లో జ‌రుగుతున్న అన్యాయాల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. నీరు- చెట్టు పేరుతో టీడీపీ నేత‌లు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని తెలిపారు. చెరువుల‌ను త‌వ్వి కోట్లు కొల్ల‌గొడుతున్నార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కృష్ణా జిల్లాకు పెడ‌తామ‌ని హామీ ఇచ్చారు. నిమ్మ‌కూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణ‌యంతో ఎన్‌టీఆర్ అభిమానులు, జిల్లా వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
Back to Top