వైయస్ జగన్ రైతు మహాధర్నా

వైయస్సార్ జిల్లాః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్  కడప రైతు మహాధర్నా వేదిక వద్దకు చేరుకున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రైతులతో కలిసి కడప కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు.  రాయలసీమ ఆయకట్టుకు నీరందించకపోవడానికి నిరసనగా ఈధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొనేందుకు రైతులు, వైయస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 


రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని  పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది . శ్రీశైలంలో 854 అడుగుల లెవల్ మెయింటైన్ చేయాలని, రాయలసీమ జిల్లాలకు సాగు నీరు అందించాలని ప్రతిపక్ష వైయస్సార్సీపీ మొదటి నుంచి పోరాడుతూనే ఉంది. రాయలసీమకు ప్రభుత్వం చేస్తున్న మోసాలను వైయస్సార్సీపీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంది. 

మహానేత వైయస్ఆర్ హయాంలో 80 శాతం  ప్రాజెక్ట్ పనులు పూర్తికాగా, మిగిలిపోయిన  పనులను పూర్తి చేయకుండా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలని, సీమ ప్రజలకు సాగునీరిచ్చి ఆదుకోవాలని వైయస్సార్సీపీ పలు దఫాలుగా ఉద్యమించింది. ఐనా దున్నపోతు మీద వాన కురిసిన చందాన ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున రైతులతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహాధర్నా చేపట్టింది. 


Back to Top