రాజ్యాంగం ఆర్టికల్ 3 సవరణకు కలిసిరండి

న్యూఢిల్లీ :

రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాష్ట్రాలను అడ్డగోలుగా విభజించకుండా చూసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు కలిసిరావాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బీజేపీ అగ్రనేతలను కోరారు. పార్లమెంట్ లాబీల్లో బుధవారం ఆయన బీజేపీ అధ్యక్షుడు రా‌జ్‌నాథ్ సింగ్, అద్వానీ, మురళీ మనోహ‌ర్ జోషి, యశ్వంత్ సిన్హాలతో ఈ విషయమై దాదాపు పావుగంట‌ పాటు మాట్లాడారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 సవరణకు తోడ్పాటునివ్వాలని శ్రీ జగన్ పార్టీ నాయకుల బృందంతో కలిసి లోగడ రాజ్‌నాథ్‌ను ఒకసారి కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి బీజేపీ నేతలకు ఈ విషయమై విజ్ఞప్తి చేశారు.

జగ‌న్‌కు ఎంపీల అభినందనలు:
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని పార్లమెంట్‌లో పలువురు ఎంపీలు అభినందించారు. సెంట్రల్‌ హాలులో శ్రీ జగన్ ఉండగా వివిధ పార్టీల సభ్యులు పలువురు వచ్చి ఆయనను పలకరించారు. ‘మీరు మంచి పని చేస్తున్నారు. ఒంటరిగా బాగా పోరాడుతున్నారు’ అంటూ వారు అభినందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top