చేతివృత్తిదారులకు అండగా ఉంటా

కృష్ణా జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేతివృత్తిదారులకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ గురువారం  ఇందుపల్లిలోని చేతివృత్తిదారుడు వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని  పరామర్శించారు. వయస్సు మీద పడటంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వెంకట సుబ్బయ్య వైయస్‌ జగన్‌కు తెలిపారు. తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చేతివృత్తుల వారు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ వారికి ధైర్యం చెప్పారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేతివృత్తిదారులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 
 
Back to Top